లండన్ గల్లీలో కారులో షికారు : 119 ఏళ్ల నాటి వింటేజ్ నడిపిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)
లండన్ : కార్లు, బైకులంటే యువతకు మోజు. కానీ సెలబ్రిటీలకు మోజు కూడా క్రేజీగా మారుతుంది. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని .. షెడ్డులో లేని బైకు లేదంటే అతిశయోక్తి కాదెమో. సినీతారలు, క్రీడాకారులకు కార్లు అంటే పడిచస్తారు. ముఖ్యంగా బ్రాండెడ్ కార్లలో షికారు చేసి .. వీడియోలు షేర్ చేస్తారు. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కారు నడిపి ఆశ్చర్యపరిచారు.
రయ్ .. రయ్ ..
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్ .. మనకు క్రీడాకారుడిగా తెలుసు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన పెద్దగా పేరురాలేదు. దాతృత్వం కూడా ఎక్కువే. ఏపీలోని ఓ కుగ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. అయితే లండన్‌లో వరల్డ్ కప్ జరుగుతున్నందున అక్కడే మకాం వేసిన సచిన్ కాసేపు సరదాగా నడిపారు. భార్య అంజలితో కలిసి రయ్ మంటూ కారులో వెళ్లారు. అయితే అది మాములు కారు కాదు. 119 ఏళ్ల నాటి వింటేజ్ కారు.

వీడియో షేర్ ...
లండన్‌లో ఉన్న సచిన్ దంపతులు రాయల్ ఆటోమొబైల్ క్లబ్‌లో వింటేజ్ కారులో షికారు చేశారు. దీనికి సంబంధించి వీడియోను ఆటోకార్ ఇండియా ఎడిటర్ సోరబ్జీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. కారు ముందుభాగంలో సచిన్ వింటేజ్ కారు డ్రైవ్ చేస్తుండగా .. వెనుక సీట్లో అంజలి రాజసం ఒలకబొసేలా ఆశీనులయ్యారు. సచిన్ డ్రైవ్ చేసే ఓల్డ్ వింటేజ్ కారు వీడియో తీస్తూ బిజీగా ఉన్నారు. కారు గేర్లు గల పాత వింటేజ్ కారు నడిపి మురిసిపోయారు సచిన్. అయితే ఈ కారు స్పీడ్ ఎంతో తెలుసా .. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. పాత వింటేజ్ కారు నడిపే అవకాశం కల్పించిన రాయల్ మోటార్స్ కంపెనీకి సచిన్ .. కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు సచిన్‌కు స్పోర్ట్స్ కార్లంటే ఇష్టం. అంతేకాదు ఇటీవల సచిన్ ఫార్ములా రేస్ కారు నడిపి అమితానందనాకి గురైన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications