ట్రంప్ కోసం పని చేస్తావా: వైట్ హౌస్ మీడియా సెక్రటరీ సారా సాండర్స్‌ను గెంటేసిన రెస్టారెంట్!
వాషింగ్టన్: శ్వేతసౌధం మీడియా సెక్రటరీ సారా సాండర్స్‌కు ఓ రెస్టారెంటులో చేదు అనుభవం ఎదురైంది. అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కోసం పని చేస్తున్నారంటూ ఆమె పట్ల రెస్టారెంటు యజమానులు దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించినంత పని చేశారు.
ఈ విషయాన్ని సారా సాండర్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రూరల్ వర్జీనియాలో లెగ్జింగ్టన్‌లోని రెడ్ హెన్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. యజమానే స్వయంగా వెళ్లిపోవాలని చెప్పడంతో తాను మౌనంగానే అక్కడి నుంచి వచ్చేశానని ఆమె తెలిపారు. ఈ ఘటనతో తానేమీ పెద్దగా బాధపడలేదని, రెస్టారెంట్ యజమానే తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారన్నారు.

ఆమె చేసిన ట్వీట్‌కు వేలాది స్పందనలు వచ్చాయి. వాటిలో ఆమెకు అనూలంగా, ప్రతికూలంగా ఉన్నాయి. సారా తండ్రి అర్కాన్సా, మాజీ గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మైక్ హకబీ కూడా ఈ ట్వీట్ పైన స్పందించారు.












Click it and Unblock the Notifications