Putin వార్నింగ్: బెదిరే రకం కాదు.. భయపెట్టే రకం: రష్యా కొత్త క్షిపణి ప్రయోగం, భూమిపై ఎక్కడైనా..
మాస్కో: "మమ్మలను భయపెట్టాలనుకుంటే మీ తరం కాదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆపై కయ్యానికి కాలు దువ్వండి. ఖబడ్దార్" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్యాత్య శతృదేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సర్మత్ ఖండాంతర క్షిపణి ప్రయోగం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సర్మత్‌ను సాటాన్ 2గా పాశ్చాత్య దేశ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇది రష్యా మలితరం క్షిపణిగా చెబుతున్నారు. అందుకే దీన్ని పుతిన్ ఇన్విన్సిబుల్ అని పిలుస్తున్నారు. అంతకుముందు రష్యా ఇదేతరహా కింజల్, అవన్‌గార్డ్ హైపర్ సానిక్ క్షిపణులను ప్రయోగించింది.

గత నెలలో ఉక్రెయిన్‌పై దాడుల సమయంలో తొలిసారిగా రష్యా కింజల్ క్షిపణిని ప్రయోగించింది.ఈ క్షిపణిని ప్రయోగించేందుకు రష్యా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సర్మత్ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో రష్యా అధ్యక్షుడు దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలను దీని కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంపై పుతిన్ అభినందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
" ఈ ఖండాతర క్షిపణి అత్యంత బలోపేతమైన మిస్సైల్. ఇది ఒక ప్రత్యేకమైన ఆయుధం. ఇది రష్యా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాదు శతృవులు రష్యా పై దాడులు చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు " అని పుతిన్ అన్నారు. ఇక రష్యా చేసిన ఈ బాలాస్టిక్ మిస్సైల్ ప్రయోగంకు ఉత్తర రష్యాలోని ప్లెస్‌ట్స్‌క్ కాస్మోడ్రోమ్ వేదికగా నిలించింది. ఈ క్షిపణి వార్‌హెడ్స్‌ను తూర్పు రష్యా ప్రాంతంలోని కామ్‌చత్కా పెనిన్‌సులాకు చేరవేసింది.
సర్మత్ అనే ఈ క్షిపణి భూభాగంపై ఉన్న ఎలాంటి లక్ష్యాలనైనా చేధించగలదని రష్యా రక్షణ వ్యవస్థ పేర్కొంది. ఈ ప్రయోగంతో రష్యా అణ్వాయుధ వ్యవస్థ మరింత బలోపేతమైందని వెల్లడించింది. ఇక సర్మత్ క్షిపణిని పసిగట్టడం అంత తేలిక కాదని వివరించింది. 200 టన్నుల బరువున్న సర్మత్ క్షిపణి భూమిపై ఎలాంటి టార్గెట్‌నైనా ధ్వంసం చేయగలదని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.












Click it and Unblock the Notifications