తొలిమహిళ: అమెరికాలో సౌదీ దౌత్యవేత్తగా యువరాణి రీమా బందార్ నియామకం

రియాద్ : అమెరికాలో సౌదీ దౌత్యవేత్తగా తొలిసారి ఓ మహిళను నియమించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. యువరాణి రీమా బిన్ బందార్‌ అగ్రరాజ్యం అమెరికాలో సౌదీ దౌత్యవేత్తగా నియమించడం జరిగింది. వరుస రాచరిక ఉత్వర్వులు ఈ మేరకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం దౌత్యవేత్తగా ఉన్న యువరాజు ఖలిద్ బిన్ సల్మాన్‌ను రక్షణశాఖ డిప్యూటీ మంత్రిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. యెమెన్ సరిహద్దులో యుద్ధం చేస్తున్న సౌదీ సైనికులకు ఖలిద్ బిన్ సల్మాన్ బోనస్‌గా వచ్చిన ఒక నెల జీతంను విరాళంగా ఇచ్చారు.

ఇక యువరాణి రీమా అమెరికా రాజకీయాలు, సమాజంపై మంచి అవగాహన కలిగి ఉందని ప్రభుత్వం తెలిపింది. అమెరికాలోనే విద్యను అభ్యసించారు రీమా. ఆ సమయంలో ఆమె తండ్రి అమెరికాలో సౌదీ దౌత్యవేత్తగా ఉన్నారు. ఇక రీమా నియామకం వారసత్వ పరంగా జరిగింది. సౌదీ అరేబియా వ్యవస్థాపకులు అబ్దుల్ అజీజ్ మనవడే రీమా తండ్రి బందార్.

Saudi Arabia names Princess Reema bint Bandar as its first female ambassador

బందార్‌ కెరీర్ పరంగా మంచి పేరును గడించారు. సౌదీ జాతీయ భద్రతా సమాఖ్య అధికారిగా, సౌదీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఉన్నతాధికారిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత 1983 నుంచి సౌదీ రాజ్యానికి అమెరికాలో దౌత్యవేత్తగా 2005 వరకు పనిచేశారు. 2015లో ఆయన పదవీ విరమణ చేశారు. 2005లో సౌదీ అరేబియాకు తిరిగి వచ్చేశాకా మంచి పారిశ్రామికవేత్తగా కూడా రీమా బందార్ గుర్తింపు పొందారు.

ఒక మహిళ ఉన్నత స్థానాన్ని అధిష్టించడం ఇది సౌదీ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. తను కొత్తగా చేపట్టనున్న బాధ్యతలపై మాట్లాడిన రీమా సామాజికంగా చాలా సవాళ్లను తాను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ దగ్గర సలహాదారుగా కూడా ఆమె పనిచేశారు. ఇక మహిళా సాధికారికత కోసం కూడా కృషి చేశారు రీమా. ఇందులో భాగంగా అమ్మాయిలు క్రీడారంగంలో రాణించేందుకు తన వంతు కృషి చేశారు. మొహ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో మహిళల అభ్యున్నతికి ఆమె రీమా బందార్ కృషి చేశారు. ఉద్యోగావకాశాల్లో సౌదీ మహిళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని గతేడాది వాషింగ్టన్‌లో మాట్లాడుతూ చెప్పారు. ఇంగ్లీషు, అరబిక్ భాషలు అనర్గళంగా మాట్లాడగల రీమా త్వరలోనే దౌత్యాధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ప్రతిష్టాత్మక్ ఫోర్బ్ మ్యగజీన్ ప్రకటించిన మధ్యతూర్పు ఆసియాలోని బలమైన తొలి 200 మహిళల్లో రీమా బందార్‌కు కూడా చోటు దక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+