Weather Change: భూతల స్వర్గంగా ఎడారి దేశం.. అందాన్ని ఆస్వాదించాలంటే రెండు కళ్లు చాలవంతే..
Riyadh: వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్ధం చివరి నాటికి థార్ ఎడారిలో పచ్చదనం చూడవచ్చని ఇప్పటికే అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే జరిగే అనర్ధాలపై చర్చ మొదలైంది. ఇదే తరహా పరిస్థితులు ఇప్పుడు సౌదీ అరేబియాలోనూ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సౌదీ అరేబియాలో వాతావరణం ఇటీవల అసాధారణంగా మారింది. భారీ వర్షాలు, వడగండ్ల వానతో పాటు పర్వత ప్రాంతాలను మంచు కప్పేసింది. దీంతో ఉత్తర అల్-జౌఫ్ ప్రాంతంలో మంచు కురుస్తోంది. ఇది ఆ ప్రాంతాన్ని వింటర్ వండర్‌ల్యాండ్‌గా మార్చేసింది. వసంత ఋతువులో పుష్పించే పూలకు ఫేమస్ అయిన ప్రాంతం ఇప్పుడు అరుదైన శీతాకాల సీనరీతో పర్యాటకులను అలరిస్తోంది.

منطقة الجوف تكتسي بالبياض إثر نزول البرد وهطول أمطار غزيرة.https://t.co/6C7QZfizK0#واس_عام pic.twitter.com/9sjr9AGd61
— واس العام (@SPAregions) November 2, 2024
అకస్మాత్తు వెదర్ మార్పులతో అలర్ట్ అయిన సౌదీ వాతావరణ విభాగం అల్-జౌఫ్‌లో ఉరుములు, వాన, వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ పౌరులకు సూచించింది. జాజాన్, అసిర్, మక్కా, మదీనా వంటి ఇతర ప్రాంతాలు కూడా వీటి బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. అరేబియా సముద్రం నుంచి ఒమాన్ వైపు అల్ప పీడనం కారణంగా చుట్టుపక్క దేశాల్లోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి.
Snow in Saudi Arabia ❄️❄️❄️❄️ pic.twitter.com/bRVp4Dkdeg
— Halal Nation ☪︎ (@HalalNation_) November 3, 2024
ఏది ఏమైనా ఈ వాతావరణం మార్పులు తీసుకొచ్చిన ప్రకృతి సౌందర్యం సందర్శకులను ఆకర్షిస్తోంది. వీటికితోడు రాఫ్హా ప్రాంతంలో ప్రవహించే కాలువలు మరియు నీటితో నిండిన సహజ జలాశయాలు అందమైన లాండ్‌స్కేప్‌ను సృష్టించాయి. సౌదీ మీడియా రిలీజ్ చేసిన అద్భుతమైన చిత్రాలు, ప్రకృతి రమణీయ దృశ్యాల పట్ల ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు.












Click it and Unblock the Notifications