ఈ రక్త పరీక్ష చెప్పేస్తుంది.. మీరు ఎన్నేళ్లు బ్రతుకుతారో!
ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో నిర్ధారించే రక్త పరీక్షను అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు.
బోస్టన్: ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో నిర్ధారించే రక్త పరీక్షను అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. దీనికోసం వారు 'బయోమార్కర్ వ్యవస్థ'అనే సరికొత్త వ్యవస్థను అభివృద్ధి చేశారు.
మనుషుల జీవిత కాలాన్ని అంచనా వేసేదే ఈ బయోమార్కర్ వ్యవస్థ. దీనికోసం బోస్టన్ విశ్వవిద్యాలయపరిశోధకులు 5 వేల మంది రక్త నమూనాలపై పరిశోధన చేపట్టారు.
ఆ రక్త నమూనాలను దానం చేసిన వ్యక్తుల ఆరోగ్య వివరాలను ఎనిమిదేళ్లపాటు పరిశీలించారు. ఏళ్లు పైబడ్డాక వచ్చే క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధుల లక్షణాలు, వాటి బయోమార్కర్లు గుర్తించారు.

వీటితో 26 భిన్న బయోమార్కర్లు కలిగిన తాజా అంచనాల వ్యవస్థను సిద్ధం చేశారు. మన రక్త నమూనాలోని బయోమర్కర్లను వీటితో సరిపోల్చడంతో ఎన్నేళ్లు బతుకుతారో చెప్పవచ్చని పరిశోథకులు థామస్ పెర్ల్స్ పేర్కొన్నారు.
ఈ పద్ధతి ద్వారా వివిధ వ్యాధుల ముప్పును తొలినాళ్లలోనే గురించే వీలుంటుందని, అయితే ఫలితాలలో కచ్చితత్వం పెంచేందుకు ఇంకా లోతైన పరిశోధన అవసరమని థామస్ అభిప్రాయపడ్డారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications