కిమ్‌కు షాక్: ఉ.కొరియాకు పోటీగా ద. కొరియా క్షిపణి ప్రయోగం, యుద్దం తప్పదా?
Recommended Video

సియోల్: ఉత్తరకొరియా రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించడంతో దక్షిణ కొరియా కూడ రెచ్చిపోయింది. ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన క్షణాల్లోనే దక్షిణ కొరియా కూడ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియాకు బుద్ది చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చేందుకే ఈ క్షిపణిని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.
ఉత్తరకొరియా రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.. ఈ క్షిపణి ద్వారా ఉత్తరకొరియా నుండి తన లక్ష్యాన్ని చేధించే సత్తా ఉత్తరకొరియాకు ఉందని రుజువైంది. అయితే ఈ క్షిపణి అత్యంత శక్తివంతమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు దక్షిణ కొరియా కూడ సన్నాహాలు చేస్తోంది. ఉత్తరకొరియాను ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా కూడ సంకేతాలు ఇచ్చింది.

దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేయడంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్షిపణితో అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా ఉత్తరకొరియా దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు ప్రకటించారు. అయితే అదే సమయంలో ఉత్తరకొరియాకు ధీటుగా సమాధానం చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని దక్షిణ కొరియా కూడ సంకేతాలు పంపింది. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం చేసిన క్షణాల్లోనే దక్షిణ కొరియా కూడ క్షిపణి ప్రయోగం చేసింది. ఈ క్షిపణి కూడ తమ లక్ష్యాన్ని చేరుకొంది. ఈ రెండు దేశాలు పోటా పోటీగా క్షిపణి ప్రయోగాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మూడో ప్రపంచ యుద్దం జరిగేనా?
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వ్యవహరం మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్తరకొరియాను నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు కూడ లేకపోలేదని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

ఫోన్లో చర్చించిన ట్రంప్
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్‌లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు.ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై చర్చించారు.

భద్రతా మండలి ఏం చేయనుంది.
ఉత్తర కొరియా వ్యవహరశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా భేటీ కానుంది.ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగంపై చర్చించనుంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియాను చేర్చడంపై భద్రతా మండలి చర్చించనుంది.అయితే భద్రతా మండలి ఉత్తరకొరియాపై ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications