భారీ భూకంపం: తూర్పు తీరం విలవిల- సునామీ అలలు
Japan earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయించారు. బీచ్ లను మూసివేశారు. భూకంప తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. భారీ భవనాలు కుంగిపోయాయి. బీటలు వారాయి. ఇప్పటివరకు 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా రికార్డయింది. ఆ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11:44 నిమిషాలకు అమోరి ప్రిఫెక్చర్ తీరం సమీపంలో భూమి ప్రకోపించింది. ప్రిఫెక్చర్ ఉపరితలం నుంచి 20 కిలోమీటర్ల దిగువన ఈ ప్రకంపనలను నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. టెక్టానిక్ ప్లేట్లల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు తెలిపింది. జపాన్ న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ అణు విద్యుత్ కేంద్రాలలో ఎటువంటి అసాధారణ పరిస్థితులు లేవని ప్రకటించింది.

ఈ భూకంపం ప్రభావం వల్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. భూకంప ప్రభావం సమీప ప్రాంతాలపై పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. బీటలు వారాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి. దీనికి అనుగుణంగా సునామీ అడ్వైజరీ కూడా జారీ అయింది.
జపాన్.. భూగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో క్రియాశీలక అగ్నిపర్వత జోన్‌లో కొనసాగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక భూకంప నెట్‌వర్క్‌లో ఉన్నందున ప్రకంపనలు సర్వసాధారణం. 3 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో భూమి తరచూ ప్రకంపిస్తుంటుందక్కడ. ఆరుకు పైగా తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జపాన్‌లో భూకంప తీవ్రతను లెక్కించడానికి షిండో స్కేల్‌ను ఉపయోగిస్తారు. ఇది అమెరికాలో ఉపయోగించే మోడిఫైడ్ మెర్కల్లీ ఇంటెన్సిటీ స్కేల్. భూకంపం విడుదల చేసే మాగ్నిట్యూడ్ ను రిక్టర్ స్కేల్ కొలుస్తుంది. షిండో స్కేల్ ప్రకారం.. నాలుగు లేదా అంతకంటే తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలను తేలికపాటివిగా పరిగణిస్తారు. అయిదు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ప్రకంపనలు తీవ్రమైనవిగా భావిస్తారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications