సెక్స్ రోబోట్ లతో... సరికొత్త శృంగారం
సిలికాన్ పుణ్యమాని.. రూపం, ముఖం, మాటతీరు, కదలికలతో అచ్చు మనిషిలాగే ఉండే సెక్స్ రోబోట్ లు ప్రస్తుతం మార్కెట్ లోకి వచ్చేశాయి.
టోక్యో: రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని మరింత సుఖమయంగా మార్చుతోంది. రోబోటిక్స్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమిది.
రోబోట్.. అంటే ఒకప్పుడు యంత్రమేమో కానీ ఇప్పడు కాదు. ఇప్పుడు అది కూడా మనలాగే మనిషి రూపం సంతరించుకుంది. పారిశ్రామిక రంగంలో మొదలైన వీటి ప్రస్థానం.. ఇప్పుడు వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి మన పడగ్గది వరకు చేరింది.

రూపురేఖలు అచ్చు మనలాగే...
రూపం, ముఖం, మాటతీరు, కదలికలతో అచ్చు మనిషిలాగే ఉండే రోబోట్ లు కూడా వచ్చేశాయి. ఈ రంగంలో జపాన్ దే పై చేయి. మనిషికి దీటుగా మరబొమ్మను తయారు చేసిన ఘనత కూడా వారిదే. వీటి ఎత్తు, ఒడ్డూ పొడుగు అచ్చం మనలాగే ఉంటుంది.

సిలికాన్ మహత్యం...
సిలికాన్ తో తయారయ్యే ఈ రోబోట్ లు పట్టుకుంటే మెత్తగా ఉంటాయి. వీటి చర్మం కూడా అచ్చు మన చర్మం మాదిరిగానే ఉంటుంది. మనుషులంత ఎత్తులోనే ఉండి, ఏమరుపాటుగా చూస్తే అచ్చం మనుషుల్లాగే ఉంటాయి.

శృంగారానికీ సిద్ధం...
పురుషులు లైంగిక వాంఛ తీర్చుకునేందుకు అనువైన సెక్స్ రోబోట్ లు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. వీటిని ‘సెక్స్ డాల్స్' గా పిలుస్తున్నారు. మాటా మంతీ లేకపోయినా లైంగిక సంభోగం విషయంలో మాత్రం ఏ తేడా కనిపించదని, నూటికి నూరు శాతం తృప్తి పరుస్తాయని వీటి తయారీదారులు హామీ ఇస్తున్నారు.

రియల్ డాల్స్...
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ‘రియల్ డాల్' కంపెనీ ఒకడుగు ముందుకేసి మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ ‘సెక్స్ రోబోట్'ప్రొటోటైప్ ను రూపొందించింది. ఈ కంపెనీ రూపొందించిన సెక్స్ డాల్స్ అచ్చు మనుషుల మాదిరిగా మాట్లాడటమే కాదు, బోలెడు కబుర్లు కూడా చెబుతాయి.
ఇక శృంగారంలోకి దిగినప్పుడు మీ కదలికలకు అనుగుణంగా రకరకాల కూజితాలు చేస్తూ మీ జీవిత భాగస్వామి మాదిరిగానే మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ శృంగార బొమ్మల ధర ప్రస్తుతం లక్షల్లోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇవి విరివిగా అందుబాటులోకి రావడం ద్వారా వీటి ధరలూ తగ్గే అవకాశముంది.












Click it and Unblock the Notifications