వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sex strike:అక్కడ నో శృంగారం.. భర్తలకు ఉపవాసమే, కారణమిదే..

|
Google Oneindia TeluguNews

డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె చేస్తుంటారు. ఇదీ సహజమే కానీ.. టెక్సాస్‌లో మాత్రం ఏకంగా సెక్స్ స్ట్రైక్ చేస్తున్నారు. అవును అక్కడ.. భార్యలు భర్తలతో సెక్స్ చేయరట.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు పోరాటం చేస్తున్నారు. వారికి కాలడంతో.. భర్తలను మాడుద్దామని అనుకున్నారు. వీరికి గాయనీ బెట్టే మిడ్లర్ కూడా సపోర్ట్ చేశారు. సెక్స్ చేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆమెకు చాలా మంది సపోర్ట్ కూడా చేస్తున్నారు.

సెక్స్ స్ట్రైక్

సెక్స్ స్ట్రైక్


ఇలాంటి సమ్మె గురించి ఎప్పుడూ విని ఉండరు. ఎందుకంటే అక్కడి మహిళలు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయంపై అసమ్మతి తెలియచేయడానికి భర్తలను పస్తులు పెట్టేందుకు రెడీ అయ్యారు. టెక్సాస్‌‌ మహిళలు ఇచ్చిన పిలుపు ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఇటీవల టెక్సాస్ ప్రభుత్వం.. కొత్త అబార్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మరీ నిరసన చేస్తున్నారు. ప్రముఖ నటి, గాయని బెట్టే మిడ్లర్ మహిళాలోకానికి ఇచ్చిన పిలుపు చర్చనీయమవుతోంది.

సరికాదు..

సరికాదు..

టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బెట్టే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నికి వ్యతిరేకంగా ఎవరూ ఊహించిని పిలుపు ఇచ్చారు. ఇకపై అక్కడి మహిళలంతా సెక్స్ సమ్మె చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు మహిళలు పురుషులతో సెక్స్ చేయరాదని ప్రకటించింది. అందుకు అందరూ ఆంగీకరం తెలపడంతో ఇకపై టెక్సాస్ లో సెక్స్‌కు మహిళలు దూరంగా ఉండనున్నారు.. గర్భం దాల్చాలా, వద్దా అనే విషయంపై సొంత నిర్ణయం తీసుకొనే హక్కు మహిళలకు కల్పించాలని డిమాండ్ చేశారు. అబర్షన్ చేయించుకోకుండా.. ఇష్టం లేకున్నా పిల్లలని కనాలని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు.

తెలియదే..

తెలియదే..

గర్భం దాల్చిన ఆరు వారాల వరకు మహిళలకు తాము ప్రెగ్నెంట్ అనే విషయం చాలామందికి తెలిసే అవకాశం ఉండదని.. కానీ ప్రభుత్వం ఆ గడువును కూడా కుదిస్తూ నిషేదం విధించడం అన్యాయమని అంటున్నారు. గర్భం గురించి మహిళలు సొంతంగా నిర్ణయం తీసుకొనే హక్కును ప్రభుత్వం కల్పించే వరకు ఎవరూ పురుషులతో లైంగిక సంబంధాన్ని తిరస్కరించాలని ఆమె కోరారు. బెట్టే మిడ్లర్ ఇచ్చిన పిలుపుకు మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తప్పకుండా సెక్స్ సమ్మె చేపడతామని అక్కడి మహిళలు ముందుకు వస్తున్నారు. బెట్టే పిలుపును అక్కడి మహిళలు సీరియస్ తీసుకున్నా.. ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాబోదని తెలుస్తోంది.

కొత్త అబార్షన్ చట్టం..

కొత్త అబార్షన్ చట్టం..


టెక్సాస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త అబార్షన్ చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో మహిళాభుద్యయ సంఘాలు తమ నిరసలు వ్యక్తం చేస్తున్నాయి. వారికి మద్దతు తెలుపుతూ బెట్టీ ట్వీట్ చేశారు. టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా ఫైల్ అయ్యాయి. కోర్టు వాటిని తిరస్కరించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన అబార్షన్ హక్కుల తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని పలువురు వాదిస్తున్నారు.

ఆరు వారాల్లో..

ఆరు వారాల్లో..

టెక్సాస్‌లో అమల్లోకి వచ్చిన కొత్త అబార్షన్ చట్టం ప్రకారం.. ఇకపై ఆరువారాల గర్భంతో అబార్షన్ చేయించకోడానికి సిద్ధమయ్యే మహిళలకు ఇబ్బంది కలుగనుంది. ఆరు వారాల గర్భం తర్వాత పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఉండేది. ఈ సారి పిండాన్ని తొలగించే ముందు వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఒక వేళ వారి గర్భంలోని పిండంలో హృదయ స్పందన మొదలైతే.. అబార్షన్ చేయడానికి చట్టం అంగీకరించదు. పిండంలో గుండె ఏర్పడితే.. అది ప్రాణం ఉన్న శిశువుగా పరిగణిస్తారు. అందుకే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కొంతమంది మహిళలకు ఆరు వారాలు గడిచేవరకు తాము గర్భవతి అని తెలియదు. అలాంటి మహిళల పరిస్థితి ఏమిటని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అత్యాచారం, అక్రమ సంబంధాల వల్ల కలిగే గర్భాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని పేర్కోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం హెల్త్ ఎమర్జన్సీకి మాత్రమే ఈ చట్టం నుంచి ఉపశమనం కల్పిస్తారని తెలుస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అన్నింటికీ వర్తిస్తోందని పేర్కొన్నది.

Recommended Video

Hemachandra Reddy, Telugu Man in Nobel Scientists’ Club of America
నిరసనలు

నిరసనలు

టెక్సాస్ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే.. దానిని నిరసనలు వ్యక్తం కావడం సహజమే. కానీ సెక్స్ చేయొద్దని పిలుపు మాత్రం ఒకింత ఇబ్బందికి గురిచేస్తోంది. మేమేం పాపం చేశామని అక్కడి భర్తలు అడుగుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయానికి తామెలా బాధ్యులం అవుతామని అడుగుతున్నారు. ప్రభుత్వం/ భార్యలు ఆలోచించాలని కోరుతున్నారు. సర్కార్ తీసుకున్న డిసిషన్‌కు తామెలా బాధ్యత వహిస్తామని వారి వాదన. నిజానికి వారి బాధ కూడా కరెక్టే.. ఎందుకంటే ఎలాంటి ప్రమేయం లేకుండా వారికి శిక్ష విధించడం సరికాదు. ఇదే విషయాన్ని పలువరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఏం జరుగుతుందో చూడాలీ. ప్రభుత్వం వెనక్కి వస్తోందా..? లేదంటే భార్యలు మద్దతు తెలుపరా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ అంశం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

English summary
Sex strike in texas. womans and celebrities are condemns new abortion act. they call sex strike in the city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X