వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రీసెర్చ్: భర్తను యువతులు పంచుకుంటే మంచిదట!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడే బహుభార్యత్వం... తప్పని చెబుతుంటారు. అయితే, తాజా పరిశోధనలో మాత్రం... కొన్ని పరిస్థితుల్లో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందని తేలిందట.

చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా బహుభార్యత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అయితే, పైన టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలా కాకుండా ఒకే భర్త, ఒకే భార్య ఉన్న కుటుంబాల పైన పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వానికి అనుమతి ఉంది.

Sharing husband could boost family health and wealth!

ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే.. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లోనే తగినంత ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారని తేలిందంటున్నారు. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద బాగుందని, వీళ్లు పెద్ద కమతాలలో వ్యవసాయం చేస్తుంటారని తేలిందంటున్నారు.

తక్కువ ఆవులు, కొంతే భూమి ఉన్న వారి కంటే ఎక్కువ ఆవులు, ఎక్కువ భూమి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో తేలిందని చెబుతున్నారు. అలాగే, స్థానిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఎంతమంది భాగస్వాములు అన్నది సమస్య కాదని... మహిళలకు స్వేచ్ఛ ముఖ్యమని చెప్పారు.

English summary
Polygyny - where one husband has more wives than one - may not be as bad as it is often made out to be. New research has found that the practice of sharing a husband may, in some circumstances, lead to greater health and wealth for women and their children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X