పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, వరుసగా రెండోసారి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పాక్‌ ముస్లింలీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌ - ఎన్‌) పార్టీ అగ్రనేత షెహబాజ్‌ షరీఫ్‌ రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో ఆయన 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

336 సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీలో ఆదివారం ప్రధానమంత్రి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. అందులో పీఎంఎల్​-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన షెహబాజ్​ 201 ఓట్లు సాధించారు. షెహబాజ్​‌కు పోటీగా జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌​కు చెందిన పార్టీ నుంచి ఒమర్ అయూబ్​ ఖాన్‌​కు 92 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Shehbaz Sharif elected Pakistan Prime Minister for second term after controversial vote

కాగా, ఓటింగ్ సందర్భంగా పార్లమెంటులో పాకిస్థాన్‌ తెహ్రీక్‌- ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) మద్దతుగల చట్టసభ్యుల నినాదాలతో గందరగోళం జరిగింది. ఇమ్రాన్​ ఖాన్​‌కు మద్దతుగా ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ ఓటింగ్ నిర్వహించి విజయం సాధించిన షెహబాజ్‌​ను ప్రధానిగా స్పీకర్ ప్రకటించారు. షరీఫ్​ మొదటిసారి 2022 ఏప్రిల్​ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు.

ఈ నేపథ్యంలో తనను ప్రధానిగా చేసినందుకు అందరికి షెహబాజ్​ కృతజ్ఞలు తెలిపారు. ' నాపై విశ్వాసం ఉంచి నున్ను ప్రధానిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదములు. పాకిస్థాన్‌​ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ పార్లమెంటులో ఉన్నారు. వీరిలో జర్నలిస్టుల, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ముందు పెద్ద సవాలే ఉంది. ఈ పని కష్టమే కానీ, పాకిస్థాన్ విధిని మార్చాలి అని అందరం కలిసి అనుకుంటే అది సాధ్యం అవుతుంది' అని షెహబాజ్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+