సెక్స్ టాయ్స్ స్ట్రక్: వినియోగదారుల బెంబేలు, కంపెనీపై ఆగ్రహాజ్వాల..
సూయజ్ కెనాల్‌లో వారం రోజుల నుంచి ఎవర్ గివెన్ నౌక ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. అయితే కాస్త కదలడంతో అటూ ఇటూ తిరిగి చిన్న నౌకలు ప్రయాణించేందుకు వీలు కలుగుతోంది. వారం నుంచి కాలువకు అటూ ఇటూ వందల నౌకలు ఆగిపోయాయి. వాటిలో సెక్స్ టాయ్స్ నౌక ప్రత్యేకమైనది. ఆ నౌకలో సామగ్రి చేరాల్సిన చోటకి చేరలేదు. దీంతో సెక్స్ టాయ్స్ కోసం ప్రజలు లబోదిబోమంటున్నారు.

భారత్‌లో తక్కువే కానీ..
వాస్తవానికి దేశంలో సెక్స్ టాయ్స్ వాడకం చాలా తక్కువ కాగా విదేశాల్లో మాత్రం అలా కాదు. చాలా మంది వినియోగిస్తారు. అవి లేకపోతే ప్రాణం పోయినట్లే ఫీలవుతారు. విదేశాల్లో సెక్స్ టాయ్స్ మార్కెట్ చాలా పెద్దది. వారం నుంచి నిలిచిపోయిన షిప్పులో వేల కొద్దీ సెక్స్ టాయ్స్ ఉన్నాయి. అవి గమ్యస్థానానికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

సెక్స్ టాయ్స్ మాత్రం
సూయజ్ కాలువలో గత గురువారం కార్గో నౌక ఎవర్ గివెన్ ఇరుక్కుపోయింది. దానిని ఎలాగొలా కాస్త పక్కకు జరపగలిగారు. తిరిగి నౌకలు అటూ ఇటూ వెళ్లేందుకు చిన్నపాటి మార్గం ఏర్పడింది. డచ్ కంపెనీ ఈడీసీ రిటైల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. కోట్ల కొద్దీ లాస్ వచ్చిందని అంటోంది. కంపెనీ నెదర్లాండ్స్, బెల్జియంకి పెద్ద ఎత్తున సెక్స్ టాయ్స్ సప్లై చేస్తోంది. చాలా మంది ఆన్‌లైన్‌లో సెక్స్ టాయిస్ బుక్ చేసుకుంటారు. వాటిని నౌకలో గమ్య స్థానానికి తరలిస్తారు. ప్రస్తుతం గమ్యస్తానానికి చేరలేకపోయిన నౌకలో 20 కంటైనర్లలో టాయ్స్ ఉన్నాయి.

అందులో ఉన్నవి ఇవే
వాటిలో డిల్డోలు, వైబ్రేటర్లు, పురుషుల స్వయంతృప్తి మెటీరియల్ ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చిన వారు డెలివరీ కాకపోవడంతో కంపెనీపై ఫైర్ అవుతున్నారు. ఎవర్ గివెన్ నౌక పక్కకు జరిగినందున ఇతర నౌకలు రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతోంది. సెక్స్ టాయ్స్ నౌక కూడా గమ్యస్థానానికి రెండ్రోజుల్లో చేరుతుంది. ఎవెర్ గివెన్ నౌకలో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారు చట్టపరమైన సమస్యలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

క్రిమినల్ అభియోగాలు
వారిపై క్రిమినల్ అభియోగాలు నమోదవుతాయి అని తెలుస్తోంది. అలా జరగకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇకపై నౌక కెప్టెన్, సిబ్బందీ నౌకల్లో ప్రయాణాలు చేయకుండా ఆంక్షలు విధిస్తారని తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు పూర్తయ్యేవరకూ వారిని హౌస్ అరెస్ట్ చేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications