Sebastien Lecornu : 27 రోజుల్లోనే ప్రధాని రాజీనామా...! ఫ్రాన్స్ లో మరో సంక్షోభం..!
ఫ్రాన్స్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ప్రధాని సెబాస్టియన్ లెకార్నో ఇవాళ అనూహ్య పరిణామాల మధ్య తన పదవికి రాజీనామా సమర్పించారు. ప్రధాని పదవిని చేపట్టిన 27 రోజుల్లోనే ఆయన తప్పుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఫ్రాన్స్ తో పాటు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే సెబాస్టియన్ ఇలా 27 రోజుల్లోనే ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి దారి తీసిన కారణాలేంటో ఓసారి చూద్దాం..
సెప్టెంబర్ 9న సెబాస్టియన్ ప్రధాని పదవిని చేపట్టారు. అయితే తాజాగా ఆయన తన కేబినెట్ ను విస్తరించారు. ఇందులో ఆయన కేబినెట్ సహచరులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మిత్రపక్షాలతో పాటు సన్నిహితులు ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరించడంతో చేసేది లేక ప్రధాని సెబాస్టియన్ పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ కు సన్నిహితుడైన మ్యాక్రాన్ నిన్న కేబినెట్ విస్తరణ చేసారు. ఇవాళ మధ్యాహ్నం తొలి కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉంది. ఆ లోపే సెబాస్టియన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.

కొత్త మంత్రివర్గ కూర్పు సెబాస్టియన్ ప్రత్యర్థులతో పాటు మిత్రపక్షాల్ని సైతం చికాకు పెట్టిందని తెలుస్తోంది. వారు దీనిపై తీవ్ర అసంతృప్తిగా ఉండటం, ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని తేల్చయడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ ఎన్నికల్లో ఏ పార్టీకీ తగినంత మెజార్టీ లభించకపోవడంతో అధ్యక్షుడి అనుచరుడైన సెబాస్టియన్ నేతృత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఇది కూడా కుప్పకూలడంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రధాని సెబాస్టియన్ ఇవాళ తన రాజీనామాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ కు సమర్పించారు. దీన్ని ఆయన ఆమోదించారు. గత రెండేళ్లలో ఐదో ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్. సెబాస్టియన్ ముందున్న ఇద్దరు మాజీలు, ఫ్రాంకోయిస్ బేరౌ , మైఖేల్ బార్నియర్‌లను వ్యయ ప్రణాళికపై ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో పార్లమెంట్ అభిశంసించింది. ఫ్రాన్స్ ప్రభుత్వ రుణం రికార్డు స్థాయికి చేరుకుందని గత వారం అధికారిక గణాంకాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సెబాస్టియన్ స్ధానంలో నియమితులయ్యే కొత్త ప్రధానికీ ఈ చికాకు తప్పేలా లేదు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications