షాకింగ్ ఘటన: విడాకులు ఇచ్చినా... పెట్రోలు పోసి!
విడాకులు ఇచ్చిన కొద్ది సేపటికే తన మాజీ భార్యపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. ఆపైన ఏమీ ఎరుగని వాడిలా తాపీగా అక్కడ్నించి నడుకుకుంటూ వెళ్ళిపోయాడు.
బీజింగ్: విడాకులు ఇచ్చిన కొద్ది సేపటికే తన మాజీ భార్యపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. ఆపైన ఏమీ ఎరుగని వాడిలా తాపీగా అక్కడ్నించి నడుకుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఈశాన్య చైనాలోని పన్షి నగరంలో చోటుచేసుకుంది.
ఇది జరిగిన వెంటనే విడాకుల కార్యాలయంలోని సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆమె జుట్టు కాలిపోయింది. ఇదంతా ఆక్కడి సిసి కెమెరాల్లో రికార్డు కూడా అయింది.
36 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో మియావోపాయ్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. వీడియోలో సదరు వ్యక్తి తొడ మీద కూడా మంటలు అంటుకుంటాయి. అతడు బయటికి వచ్చి, నెమ్మదిగా ఆ మంటలు ఆర్పుకుని, వెనక్కి తిరిగి చూడకుండా అక్కడినించి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.

తర్వాత జుట్టుకు మంటలు అంటుకున్న అతడి మాజీ భార్య లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈలోగా ఇద్దరు వ్యక్తులు పరుగు పరుగున వాచీ ఆమె జుట్టుకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు.
అయినా ఫలితం కానరాక పోవడంతో ఆమె తన ఒంటిపై కాలుతున్న దుస్తులు కూడా విప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి అగ్నిమాపక పరికరాలతో మంటలు ఆర్పుతారు.
నిజానికి ఆ దంపతులకు అదేరోజు ఉదయం విడాకులు మంజూరు అయ్యాయి. తన మాజీ భార్య పట్ల తీవ్రంగా ద్వేషం పెంచుకుని ఉండడం వల్లే ఆమె భర్త అలా పెట్రోలు పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications