ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం, ఒకరు మృతి, పలువురికి గాయాుల
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో సాయుధుడైన ఓ దుండగుడు విద్యార్థులపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాల్పుల ఘటనతో పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని విద్యార్థులు, సిబ్బందికి పోలీసులు సూచించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్..బాధితులకు సానుభూతి తెలియజేశారు. కాగా, కాల్పుల ఘటనతో యూనివర్సిటీలో జరగాల్సిన పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ను రద్దు చేశారు. గత కొంత కాలంగా అమెరికాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ఆందోళన చెందే అంశంగా మారింది.
పడవ ప్రమాదంలో 50 మంది మృతి
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మబండకా పట్టణం సమీపంలో నదిలో ఓ పడవ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో దాదాపు 50 మంది మరణించారు. వందలాది మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
మంగళవారం రాత్రి దాదాపు 400 మంది ప్రయాణికులతో కూడిన పడవ (చెక్క ఓడ) కాంగో నది (Congo River) మీదుగా మతాంకుము ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయల్దేరింది. పడవ మబండకా పట్టణం సమీపంలోకి రాగానే మంటల్లో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలోకి దూకేశారు. ఈతరాక నీటిలో మునిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 50 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. వందలాది మంది గల్లంతైనట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రెడ్ క్రాస్, ప్రాంతీయ అధికారులు గల్లంతైన వారి కోసం నదిలో గాలింపు చేపట్టారు. దాదాపు 100 మందిని రక్షించి మబండకా టౌన్ హాల్‌లోని అధునాతన ఆశ్రయానికి తరలించారు. వారిలో చాలా మందికి కాలిన గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, పడవలో ఎవరో వంట చేస్తున్న క్రమంలో మంటలు వ్యాపించినట్లు తెలిపారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications