అమెరికాలో మరోసారి కాల్పులు: 3గురు పోలీసుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల పరంపర ఆగడం లేదు. తాాయగా లూసియానాలోని బ్యాటన్ రోజ్‌లో ఓ సాయుధుడు అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. ఆదివారంనాడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పోలీసులు ఆ దుండగుడిని కాల్చేశారని తూర్పు బ్యాటన్ రోజ్ మేయర్ పారిష్ కిప్ హోల్డెన్ తెలిపారు. అయితే అతడు చనిపోయాడో లేదో చెప్పలేదు. పలువురు పోలీసు అధికారులు గాయపడ్డారన్న పోలీసు చీఫ్ ఎల్‌జే మెక్నీలీ వారు ఎంత మందో వెల్లడించలేదు.

గాయపడిన వారిని రెండు ఆసుపత్రుల్లో చేర్పించారు. గతవారం డాల్‌సలో ఓ దుండగుడు ఐదుగురు పోలీసు అధికారులను చంపేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications