ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఇవే..
స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(SIPRI) నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 9 దేశాల వద్ద మొత్తం 12,241 అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ దేశాల్లో భారత్ కూడా ఉంది. అమెరికా, రష్యా వద్ద అత్యధిక స్థాయిలో న్యూక్లియర్ వెపన్స్ ను కలిగి ఉన్నాయి. ఈ రిపోర్టు ప్రకారం.. 2,100 వార్ హెడ్స్ హై అలర్ట్ లో ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు న్యూక్లియర్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ ను అలవరచుకుంటున్నాయి. కొన్ని పాత ఆయుధాలు రిటైర్ అవుతుండగా.. కొత్తవి రీ ప్లేస్ అవుతున్నాయి.
ఇటీవల ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి బాంబుల వర్షం కురిపించుకున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అందరూ భయాందోళన చెందారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య అమెరికా జోక్యం చేసుకుంది. టెహ్రాన్ లోని అన్ని న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేసింది. అయితే ఇరాన్ మాత్రం అమెరికా చర్యలను కొట్టిపారేసింది. ఈ క్రమంలో సిప్రీ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాల లిస్టు ఈ విధంగా ఉంది.
సిప్రీ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని 9 దేశాల్లో 12,241 న్యూక్లియర్ వెపన్స్ ను జనవరి, 2025 నాటికి కలిగి ఉన్నాయి. ఈ లిస్టులో భారత్ కూడా ఉంది. అంతేకాక ఈ లిస్టులో అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, పాకిస్థాన్, ఇజ్రాయిల్, నార్త్ కొరియా ఉన్నాయి. రష్యా అత్యధికంగా 5,459 న్యూక్లియర్ వెపన్స్ ను కలిగి ఉంది. ఆ తర్వాత అమెరికా 5,177 న్యూక్లియర్ వెపన్స్ ను కలిగి ఉంది. ఆ తర్వాత చైనా(600), ఫ్రాన్స్(290), యూకే(225), భారత్(180), పాకిస్థాన్(170), ఇజ్రాయెల్(90), నార్త్ కొరియా(50) ఉన్నాయి.

సిప్రీ నివేదిక, 2025 ప్రకారం.. అన్ని దేశాలు న్యూక్లియర్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్స్ లో భాగంగా న్యూక్లియర్ వెపన్స్ ను మోడ్రనైజ్ చేసుకుంటున్నాయి. 12,241 న్యూక్లియర్ వెపన్స్ లో 3,912 వెపన్స్.. మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ లో అమర్చారు. మరో 2,100 వార్ హెడ్స్ బాలిస్టిక్ మిసైల్స్ లో హై అలర్ట్ లో ఉన్నాయి. అయితే సిప్రీ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు తేలింది. అమెరికా, రష్యా లాంటి దేశాలు రిటైర్ అయిన ఆయుధాలను ఎలిమినేట్ చేస్తున్నాయి. అయితే ఎన్ని ఆయుధాలను ధ్వంసం చేస్తున్నారో.. మళ్లీ అంతే సంఖ్యలో ఆయుధాలను రీ ప్లేస్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications