కుప్పకూలిన ఖతర్ హెలికాప్టర్.. !!

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 18వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.

ఈ పరిణామాల మధ్య ఖతర్ లో ప్రమాదం సంభవించింది. ఆ దేశ సైన్యానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరు మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యల కోసం పంపించిన హెలికాప్టర్ ఇది. రెస్క్యూలో నిమగ్నమై ఉన్న సమయంలో అది క్రాష్ అయింది. ఖతర్ ప్రాదేశిక జలాల్లో కుప్పకూలింది. ఈ ఘటనపై తాజాగా ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది.

Six Killed in Qatar Helicopter Crash after technical malfunctions as the Operations Underway to Find

ఈ దుర్ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంకేతిక లోపం కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం- మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మధ్యప్రాచ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఖతార్‌పై అనేక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి అమెరికా ఇజ్రాయెల్- ఇరాన్ దాడులకు ఎటువంటి సంబంధం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రమాదానంతరం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి జాతీయత లేదా వారు ఖతర్ పౌరులా కాదా అనే వివరాలు వెల్లడించలేదు.

గాలింపు ప్రయత్నాలకు తీరప్రాంతాలు, సరిహద్దుల భద్రతా జనరల్ డైరెక్టరేట్ పరిధిలోని మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీం నాయకత్వం వహిస్తోంది. సముద్ర ప్రమాదాలలో క్విక్ రియాక్షన్ కు పేరుగాంచిన ఈ యూనిట్‌తో పాటు అంతర్గత భద్రతా దళం (లెఖ్వియా)కు చెందిన ఖతార్ అంతర్జాతీయ గాలింపు, సహాయక బృందాన్ని కూడా మోహరింపజేశారు. సంక్లిష్ట, సవాలుతో కూడిన సముద్ర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ఈ బృందాలకు విస్తృత అనుభవం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+