దద్దుర్లు, దురద ఉంటే ఒమిక్రానే.. కొత్త అధ్యయనం ద్వారా వెల్లడి
ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపించడమే కాదు.. ప్రాణాలు కూడా పోతున్నాయి. దీంతోపాటు కొత్త లక్షణాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గత వేరియంట్ల లక్షణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లక్షణాలు ఉంటాయని ప్రకటించలేదు. ఒమిక్రాన్ లక్షణాలపై లండన్ కింగ్స్ కాలేజీ, హెల్త్ సైన్స్ కంపెనీ జెడ్‌ఓఈ సంయుక్తంగా పరిశోధన నిర్వహించింది.

దద్దుర్లు, దురద
ఒమిక్రాన్ సోకిన వారి చర్మంపై అసాధారణ స్థాయిలో దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం అది ఒమిక్రాన్ లక్షణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఒమిక్రాన్ సోకిందా లేదా తెలియాలంటే చర్మంలో మార్పులను గమనించాలని లండన్ కింగ్స్ కాలేజీ పరిశోధకులు సూచిస్తున్నారు. జెడ్‌ఓఈ కొవిడ్ స్టడీ యాప్ ద్వారా 3.36 లక్షల మంది బాధితుల డేటాపై పరిశోధక బృందం అధ్యయనం చేసింది. కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు వస్తున్నట్టు గుర్తించారు.

8.2 శాతం మందిలో
కొవిడ్ పరీక్ష చేయించుకున్న 8.2 శాతం మందిలో కరోనా సాధారణ లక్షణాలు.. చర్మంపై దద్దుర్లు కనిపించాయి. సాధారణ ఇన్ఫెక్షన్ దద్దుర్లు లేదా ఒమిక్రాన్ లక్షణాలో చెక్ చేసేందుకు సైంటిస్టులు ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు. కరోనా సోకిన 12 వేల మంది చర్మంపై ఇలాంటి దద్దుర్లు కనిపించాయి. 17 శాతం మందిలో చర్మంపై దద్దుర్లు గుర్తించారు. ప్రతి ఐదుగురిలో ఒకరి చర్మంపై దద్దుర్లు కనిపించాయి. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్లలో ఒక లక్షణంగా పరిశోధకులు గుర్తించారు. యాప్ నిర్వహించిన అధ్యయనంలో 2,500 కేసుల ఆధారంగా ప్రాథమిక డేటాను పరిశీలించగా.. డెల్టా కంటే ఒమిక్రాన్ మరింత తేలికపాటిదని తేలింది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా సోకుతుందని నిర్ధారించారు.

స్టే సేఫ్..
ప్రతి సీజన్‌లో చర్మంపై పలు రకాల ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. మోచేతులు, మోకాలు, చేతులు, పాదాల వెనుక భాగంలో కనిపిస్తుంటాయి. ఇతర దద్దుర్లు మురికి వేడితో ఉంటాయి. శరీరం అంతటా కనిపిస్తాయి. కొన్నిరోజులుకు అవే మానిపోతాయి. ఒమిక్రాన్ కట్టడి చేసేందుకు ఇంట్లో ఉండాలని.. ప్రతి ఒక్కరూ జలుబు లక్షణాలు లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు. ఏమైనా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. రెండు డోసుల టీకా వేయించుకోవడం కంపల్సరీ అని అంటున్నారు.












Click it and Unblock the Notifications