H1B Visa వ్యవహారంలో అనూహ్య పరిణామం- భారత్ కు పెద్ద దెబ్బ.. !!

భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తుదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్ అయినవారు, కొత్తగా కేటాయించిన తేదీలకే హాజరు కావాలంటూ గతంలో ప్రకటించిన తేదీల్లో కాన్సులేట్ కార్యాలయాలకు వెళ్తే వాటిని తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత H-1B వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడటం లేదా రీషెడ్యూల్ అయిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

H1B వీసా దరఖాస్తుదారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది అమెరికన్ ఏంబసీ. వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేసినట్లు ఇమెయిల్ అందితే.. కొత్త తేదీని ప్రకటించేంత వరకు ఎదురు చూడాలని, పేర్కొంది. గతంలో ప్రకటించిన చేసిన తేదీన వస్తే రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌లోకి ఎంట్రీ నిరాకరిస్తామని స్పష్టం చేసింది.

Social Media Verification Issues Force US to Postpone H1B Interviews for Indians

ఈ ప్రకటన హెచ్1బీ వీసాదారులకు షాక్ ఇచ్చినట్టయింది. ఇప్పటికే అపాయింట్ మెంట్లు పొందిన దరఖాస్తుదారులు, రీషెడ్యూల్ అయినవాళ్లు మళ్లీ కాన్సులేట్ కార్యలాయాన్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు సోషల్ మీడియా అకౌంట్లన్నింటినీ కూడా అన్ లాక్ చేసి ఉంచాలని ఆదేశించడం అమెరికా అనుసరిస్తోన్న కఠిన వైఖరికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ నుంచి నిర్వహించబోయే అన్ని వీసా అపాయింట్మెంట్లకూ ఈ కొత్త నిబంధన అమలవుతుంది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ఏడాది వీసా రద్దులను విపరీతంగా పెంచిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో జనవరి నుండి 85,000 వీసాలను రద్దు చేసినట్లు స్టేట్ డిపార్టమెంట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.. ఇమ్మిగ్రేషన్- వీసా నిబంధనల అమలు, జాతీయ భద్రతపై దృష్టి సారించిందనే విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయి.

రద్దయిన ఈ 85 వేల విసాల్లో 8,000లకు పైగా విద్యార్థులకు సంబంధించినవే. అలాగే- మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, చోరీలకు పాల్పడటం వంటి ఘటనలకు పాల్పడిన వారి విసాలు కూడా రద్దయ్యాయి. H-1B దరఖాస్తుదారుల రెజ్యూమెలు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఇదివరకే అన్ని కాన్సులేట్లకు ఆదేశాలు అందాయి. తప్పుడు సమాచారం తప్పుడు ప్రచారం, కంటెంట్ మోడరేషన్, ఆన్‌లైన్ సేఫ్టీ వంటి కార్యకలాపాలలో దరఖాస్తుదారులు లేదా వారితో కూడా అమెరికాకు వచ్చే వారి సోషల్ మీడియా అకౌంట్లను సమీక్షిస్తారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+