స్పెయిన్‌: వ‌ర‌ద నీటిలో కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడండి! (వీడియో)

ఆక‌స్మిక వ‌ర‌ద‌లు స్పెయిన్‌లో బీభత్సం సృష్టించాయి. దీంతో ప‌లువురు మృతి చెంద‌గా వేలాదిగా ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అనేక‌మంది క‌నిపించ‌కుండా పోయారు. అక్క‌డి అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు చెబుతున్నారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న ఓ వీడియో చూసిన‌వారికి ఈ వ‌ర‌ద బీభ‌త్స తీవ్ర‌త అర్థ‌మైపోతుంది.

క్ష‌ణాల వ్య‌వ‌ధిలో బీభ‌త్సం..

అక్క‌డి ప్రభుత్వ అధికారి కార్లోస్‌ మజోన్ చెబుతున్న వివ‌రాల‌ను బ‌ట్టీ స్పెయిన్‌లోని వాలెన్సియాలో ఆకస్మికంగా వరదలు చుట్టుముట్టాయి. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో బీభ‌త్సం సృష్టించాయి. అక‌స్మాత్తుగా సంభ‌వించిన ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే వారి మృతదేహాలను గుర్తించిన‌ప్ప‌టికీ, మృతుల సంఖ్య‌ను స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మ‌రం చేశారు. మరోవైపు దక్షిణ స్పెయిన్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుండ‌డంతో అక్కడి వీధులను బురద నీరు ముంచెత్తింది. ఈ వరదల కారణంగా తప్పిపోయిన ప్ర‌జ‌ల‌ను గుర్తించేందుకు డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు కార్లోస్ మ‌జోన్ తెలిపారు.

Spain Watch how cars are washed away in flood waters video

రెడ్‌ అలర్ట్ జారీ..

ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల‌ నేపథ్యంలో స్పెయిన్‌ కేంద్రం ఓ సంక్షోభ కమిటీని ఏర్పాటుచేసి, ప్ర‌స్తుత‌ పరిస్థితులపై చర్చించారు. తప్పిపోయిన వ్యక్తులు, తుపాను కారణంగా సంభవించిన నష్టం గురించి ఆందోళన చెందుతున్న‌ట్లు స్పెయిన్ ప్ర‌ధాని పెడ్రో శాంచెజ్ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అధికారుల సలహాలను ప్రజలు పాటించాల‌ని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ఇప్ప‌టికే ఈ రాష్ట్ర వాతావరణ సంస్థ వాలెన్సియా ప్రాంతంలో రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ప‌లు విమాన, రైలు స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేయ‌గా, మ‌రికొన్ని దారి మ‌ళ్లించిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+