యధా ట్రంప్.. తథా వైట్‌హౌస్, అధ్యక్షులవారి ఆహ్వాన పత్రికలో అక్షర దోషాలెన్నెన్నో!

వాషింగ్టన్: 'యధా రాజ తథా ప్రజ' అన్న సామెత ఊరికే పుట్టలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థాయికి తామేమీ తీసిపోమని తాజాగా నిరూపించారు శ్వేత సౌధం అధికారులు. ఓ ఆహ్వాన పత్రికలో అలవోకగా అక్షర దోషాలు పండించారు.

అమెరికా అధ్యక్షుడు అధికారి ట్విట్లర్ ఖాతాలో అక్షర దోషాలకు లెక్కుండదు. అదీ ఆయన స్థాయి. ఆ మధ్య ఓ అంశం గురించి ట్వీట్ చేస్తూ.. coverageకు బదులుగా covfefe అని రాశారాయన. అధ్యక్షుల వారి స్థాయిలో మనమూ ఉండాలనుకున్నారో ఏమోగానీ ఆయన పాలనాధికారులు కూడా ఆయన్నే ఫాలో అయిపోయారు.

Spelling mistake on tickets for Donald Trump’s first State of the Union address invites attendees to ‘Uniom’

తాజాగా శ్వేతసౌధం అధికారులు కూడా ఇలాంటి పొరపాటే చేశారు. అది కూడా ట్రంప్ ప్రసంగం కోసం ఆహ్వానించే 'ఇన్విటేషన్ కార్డు'లో. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్ తొలిసారిగా స్టేట్ ఆఫ్ యూనియన్‌లో ప్రసంగించనున్నారు.

ఈ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించేందుకు శ్వేతసౌధం అధికారులు కార్డులు ముద్రించారు. అయితే ఆ ఇన్విటేషన్ కార్డులో unionకు బదులుగా uniom అని తప్పు పడింది.

సదరు ఆహ్వాన పత్రికను ఫ్లోరిడా సెనేటర్ మాక్రో రూబియో ట్వీట్ చేస్తూ.. 'స్టేట్ ఆఫ్ యూనియమ్' కోసం ఎదురుచూస్తున్నానంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ ఇన్విటేసన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే జరిగిన పొరపాటును శ్వేతసౌధం అధికారులు గ్రహించి నాలుక్కరుచుకున్నారు. వెంటనే హడావుడిగా మళ్లీ ఇన్విటేషన్ కార్డులు ముద్రించారు. అయితే అప్పటికే కొందరికి పాత ఇన్విటేషన్ కార్డులు అందడంతో మళ్లీ వాటిస్థానంలో కొత్త ఆహ్వాన పత్రికలు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+