బంగారం కొంటే గిఫ్టుగా "గోల్డ్ మెర్సిడెస్".. లక్కీ లక్కీ !!
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. చాలా మంది షాపింగ్ మాల్స్‌లో కూపన్‌ల కోసం ఎదురుచూసినా.. లక్ కొందరినే వరిస్తుంది. ఈ తరహా ఘటనలు ఇప్పటికే చోటు చేసుకోగా.. ఇప్పుడు లేటెస్ట్ గా దుబాయ్‌లో కాల్ సెంటర్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ విషయంలో మాత్రం విచిత్రం జరిగింది. కేవలం కొన్ని లక్షల రూపాయల పెట్టుబడితో ఏకంగా గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారును సొంతం చేసుకున్నాడు.
వాస్తవానికి దుబాయ్‌లో ఏటా వేసవిలో 'షాప్ & విన్' ప్రమోషన్లతో పాటు షాపింగ్ ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. అయితే ఈసారి తన పేరు బహుమతి గెలుచుకున్న వారి జాబితాలో ఉంటుందని సుమిత్ కలలో కూడా ఊహించలేదు. ఈ సంఘటన ప్రముఖ మీడియా సంస్థ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన జరిగి అతని పెట్టుబడికి ఏకంగా 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.

అసలేం జరిగిందంటే..?
సుమిత్ సుమారు 15,000 దీనార్లతో (దాదాపు రూ. 3.7 లక్షలు) బంగారు బిస్కెట్లను కొనుగోలు చేశాడు. ఇటీవలే ప్రారంభమైన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అతనికి అదే మొదటిసారి. డిసెంబర్ 11 నుండి ఫిబ్రవరి 8 వరకు జరిగిన 'షాప్ & విన్' ప్రచారం కింద, ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్ లభించగా, సుమిత్‌కు 30 రాఫిల్ కూపన్లు వచ్చాయి. బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసిన తర్వాత, అక్కడున్న గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారుతో సరదాగా ఫోటో దిగాడు. అయితే, అదే కారు తనకు బహుమతిగా వస్తుందని సుమిత్ కలలో కూడా ఊహించలేదు.
ఒకరోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి సుమిత్ నిద్రపోతున్న సమయంలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తమకు వచ్చిన మెయిల్‌ను పరిశీలించమని అవతలి వ్యక్తి సూచించారు. మెయిల్ చూసిన సుమిత్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. బహుమతి గెలుచుకున్నాడనే సమాచారాన్ని నిర్ధారించుకున్నాక, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అయితే, ఆ కారును అమ్మి డబ్బులు వాడుకోవాలని చాలామంది సుమిత్‌కు సలహా ఇచ్చారు. కానీ అతను ఆ ప్రతిపాదనను తిరస్కరించి, కారును తన వద్దనే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దుబాయ్‌లో రెండు దశాబ్దాల పాటు కష్టపడిన తన కృషికి లభించిన దైవ వరంగా ఈ బహుమతిని సుమిత్ అభివర్ణించాడు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications