ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో స్టీఫెన్ హాకింగ్.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!
ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త దివంగత స్టీఫెన్ హాకింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హాకింగ్ ఫోటోలు బయటపడటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఫోటోలపై ఆయన కుటుంబ సభ్యులు, ప్రతినిధులు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
అసలేముంది ఆ ఫోటోలో?
బయటకు వచ్చిన ఫోటోలలో స్టీఫెన్ హాకింగ్ ఒక సన్ లౌంజర్‌పై కూర్చుని, చేతిలో కాక్‌టెయిల్ పట్టుకుని ఉన్నారు. ఆయన పక్కన ఇద్దరు మహిళలు బికినీలో ఉన్నారు. ఈ ఫోటో 2006లో వర్జిన్ ఐలాండ్స్‌లోని సెయింట్ థామస్‌లో జరిగిన ఒక సైన్స్ సింపోజియం సందర్భంగా తీసినదిగా తెలుస్తోంది. ఆ సమయంలో హాకింగ్ అక్కడ క్వాంటం కాస్మోలజీపై ప్రసంగం ఇచ్చేందుకు వెళ్లారు.

కుటుంబ సభ్యుల వివరణ
ఈ ఫోటోలపై వస్తున్న ఊహాగానాలను హాకింగ్ కుటుంబ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు ఫోటోలో హాకింగ్ పక్కన ఉన్న మహిళలు బ్రిటన్ నుంచి వచ్చిన ఆయన దీర్ఘకాలిక వైద్య సంరక్షకులు . హాకింగ్‌కు మోటార్ న్యూరాన్ వ్యాధి కారణంగా 24 గంటల పాటు వైద్య సహాయం అవసరమని, అందువల్ల వారు ఎప్పుడూ ఆయనతోనే ఉండేవారని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తనపై వస్తున్న ఎలాంటి ఆరోపణలైనా అసంబద్ధమైనవని, అవి కేవలం దుష్ప్రచారం మాత్రమేనని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హాకింగ్ పేరు ఎందుకు వచ్చింది?
అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్‌లో స్టీఫెన్ హాకింగ్ పేరు దాదాపు 250 సార్లు ప్రస్తావించబడింది. ప్రధాన నిందితురాలు వర్జీనియా గిఫ్రే గతంలో హాకింగ్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణలను అప్పట్లోనే ఎప్స్టీన్ కొట్టిపారేశారు. గిఫ్రే చేసిన ఆరోపణలు అబద్ధమని నిరూపించిన వారికి నగదు బహుమతి ఇస్తామని కూడా ఎప్స్టీన్ తన సహచరురాలు ఘిస్లైన్ మాక్స్‌వెల్‌కు పంపిన ఈమెయిల్‌లో పేర్కొన్నారు.
Stephen Hawking is cited in Epstein files no less than 232 times
— RT (@RT_com) February 4, 2026
The files suggest Hawking had sex with at least one girl and met Epstein personally pic.twitter.com/Uufo4IeGQg
బాహ్య ప్రపంచానికి తెలిసిన నిజాలు
2018లో మరణించిన స్టీఫెన్ హాకింగ్, 2006 మార్చిలో ఎప్స్టీన్ నిధులు సమకూర్చిన ఓ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన ద్వీపం సమీపంలోని సముద్ర గర్భాన్ని ప్రత్యేకంగా రూపొందించిన సబ్ మెరైన్‌లో పర్యటించిన ఫోటోలు కూడా గతంలో విడుదలయ్యాయి. అయితే స్టీఫెన్ హాకింగ్ ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న ఫోటోలు గానీ.. నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్న ఆధారాలు గానీ ఇప్పటివరకు లభించలేదు. సైన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన స్టీఫెన్ హాకింగ్ ప్రతిష్టను దెబ్బతీసేలా వస్తున్న వార్తలను ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఆయన కేవలం ఒక శాస్త్రీయ చర్చా కార్యక్రమం కోసమే అక్కడికి వెళ్లారని వారు స్పష్టం చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications