పాకిస్తాన్ సహా మూడు దేశాలను వణికించిన పెను భూకంపాలు: సునామీ అలర్ట్

పోర్ట్ మోర్స్‌బై: పాకిస్తాన్ సహా మూడు వేర్వేరు దేశాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. వాటి తీవత్ర కూడా ఆందోళనకర స్థాయిలో నమోదయింది. కొన్ని చోట్ల భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇందుల ఒకటి ద్వీపదేశం కావడం వల్ల సునామీ హెచ్చరికను సైతం జారీ చేశారు అధికారులు. ఆ తరువాత ఉపసంహరించుకున్నారు.

పాకిస్తాన్‌, టిబెట్, పపువా న్యూగినియాల్లో ఈ తెల్లవారు జామున ఈ భూకంపాలు సంభవించాయి. పాకిస్తాన్‌లో ఈ తెల్లవారు జామున 3.38 నిమిషాలకు భూమి ప్రకంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. పాకిస్తాన్ ఉత్తర ప్రాంతంలో పెషావర్ సమీప ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.

Strong earthquake struck off these 3 countries

ఆ తరువాత సరిగ్గా అయిదు నిమిషాలకు అంటే 3:45 గంటలకు టిబెట్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.0గా నమోదైంది. దీని తీవ్రత అటు నేపాల్‌లోనూ కనిపించింది. టిబెట్- నేపాల్ సరిహద్దుల్లో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన సమాచారం లేదు.

ద్వీపదేశం పపువా న్యూగినియాలో ఇంతకంటే అధిక తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 3:16 నిమిషాలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. ఉత్తర తీరప్రాంతంలో గల పసిఫిక్ ఐలండ్ స్టేట్, ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ రాజధాని వెకాక్ టౌన్‌కు ఈశాన్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

తీరప్రాంత నగరం కావడం భూకంప తీవ్రత 6.5 వరకు నమోదు కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. 20 నిమిషాల అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. పపువా న్యూ గినియాలో భూకంపాలు సాధారణమే. రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి గానీ ఈ సారి దీని తీవ్రత అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+