చూస్తూ చూస్తూనే కుప్పకూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ..!!
ప్రకృతి వైపరీత్యాలు బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తోన్నాయి. తుపాన్లు, భారీ వర్షాలు.. అంతకుమించి బలమైన ఈదురుగాలులు వణకిస్తోన్నాయి. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. బ్రెజిల్ లోని రియో గ్రాండే డో సుల్ స్టేట్ లో వీటి తీవ్రత అంచనాలకు మించిన స్థాయిలో ఉంటోంది. అతి తీవ్రమైన ఉష్ణోగ్రత, శీతల వాయువుల కలయికతో ఈ తుఫాను సంభవించినట్లు ఆ దేశ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మధ్యాహ్నం నుండి రియో గ్రాండే డో సుల్ అంతటా దట్టమైన మేఘాలు, తీవ్రమైన ఈదురుగాలులు అలముకున్నాయి. రియో గ్రాండే డో సుల్ రాజధాని గుయిబా సిటీలో సోమవారం నాడు భారీ తుఫాను సంభవించింది. బలమైన ఈదురు గాలుల వీచాయి. దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదుగాలులు ఆ నగరాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. సిటీలోని హవాన్ మెగాస్టోర్ వెలుపల ప్రతిష్ఠించిన 79 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కుప్పకూలింది.

ఈదురుగాలుల ధాటికి నెమ్మదిగా ముందుకు వంగుతూ.. ఖాళీ పార్కింగ్ స్థలంలో నేలకూలింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రెజిల్ పౌర రక్షణ సంస్థ డిఫెసా సివిల్ ప్రకారం.. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. మెట్రోపాలిటన్ రీజియన్ మొత్తం కూడా తీవ్ర వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంత రాష్ట్రం కావడం వల్ల వీటి తీవ్రత మరింత అధికంగా ఉంటోంది.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీని 2020లో స్థాపించారు. 11 మీటర్ల ఎత్తు ఉన్న కాంక్రీట్ పునాదిపై ఇది ప్రతిష్ఠితమైంది. అది నేల కూలినప్పటికీ పునాది చెక్కుచెదరలేదు. ఈ విగ్రహం కూలిపోయే సమయంలో దాని సమీపంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. హవాన్ మెగా స్టోర్ సిబ్బంది తక్షణమే వాహనాలన్నింటినీ కూడా అక్కడి నుండి తరలించడంతో ఎటువంటి గాయాలు గానీ ఆస్తి నష్టం సంభవించలేదు.
Video footage shows a forty-meter-tall replica of the Statue of Liberty, located across from a McDonald's within the parking lot of a Havan in the Brazilian city of Guaíba, one of several dozen replicas of the statue located throughout the country, collapsing during a wind and… pic.twitter.com/kUid9lwA3b
— OSINTdefender (@sentdefender) December 15, 2025
బలమైన గాలులు, ప్రమాదకర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని డిఫెసా సివిల్ స్థానికులను హెచ్చరించింది. సెల్ బ్రాడ్‌కాస్ట్ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్‌లకు అత్యవసర హెచ్చరికలను పంపింది. టియో హ్యూగో సిటీలో కూడా భారీ వర్షాలు బెంబెలెత్తించాయి. వడగళ్లతో వర్షం కురిసిందిక్కడ. లాజెడో టౌన్ లో భారీ వర్షాల వల్ల వరదలు సంభవించాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications