పురుషాంగం కత్తిరింపు: మూడేళ్ల తర్వాత కోర్టులో ఇలా... ఎందుకు కట్ చేశాడంటే
పాశ్చాత్య దేశాలు అంటే వావి వరసలు.. గౌరవ మర్యాదలు తెలియదు. అక్రమ సంబంధాలు అయితే అడ్డగోలు.. టెక్నాలజీ పేరుతో అలా జరుగుతోంది. అయితే రెండేళ్ల క్రితం అమెరికాలోని ప్లోరిడాలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడిపై కసి తీర పగ తీర్చుకున్నాడు. హతమార్చలే కానీ.. అంతకుమించి పనిష్‌మెంట్ ఇచ్చాడు. అయితే ఇటీవల కోర్టులో కేసు విచారణకు వచ్చింది. ఆ సందర్భంలో సృహలో లేకుండా చేశానని.. తెలివతక్కువ పని అని చెప్పాడు. దీంతో అతని వ్యవహారశైలి చర్చకు వచ్చింది.

గన్ చూపించి.. చైర్‌కి కట్టేసి
ప్లోరిడాలో అలెక్స్ బొనిల్లా దంపతులు ఉంటున్నారు. వీరి సంసార జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలియరాలేదు. అయితే అతని భార్య మాత్రం మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అలా.. ఇలా విషయం అలెక్స్‌కి తెలిసింది. తీరు మార్చుకోవాలని భార్యకు సూచించాడు. అయినా వినలేదు.. దీంతో అలెక్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆ ఏటా జూలైలో దారుణానికి తెగబడ్డాడు. ఆమె ప్రియుడిపై పగ తీర్చుకున్నాడు. తన భార్య ప్రియుడి ఇంటికి వెళ్లాడు. చేతిలో తుపాకీ ఉంది కానీ షూట్ చేయలేదు.

కత్తితో పురుషాంగం కోసి
గన్‌తో బెదిరించి మరీ తాళ్లతో చెయిర్‌కు కట్టేశాడు. అతడిని తాళ్లతో కట్టేసి 'నువ్వు ఈ రోజు చావడం లేదు. కానీ ఈ రోజును నువ్వు జీవితాంతం గుర్తుంచుకుంటావు' అంటూ చెప్పుకొచ్చాడు. ఓ కత్తెర తీసుకుని అతడి పురుషాంగాన్ని కత్తిరించేశాడు. సదరు బాధితుడి ఇద్దరు కూతుళ్ల కళ్లెదుటే అలెక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత అలెక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తీసుకెళ్లారు. రెండేళ్ల నుంచి ఈ కేసు కోర్టులో నడుస్తోంది. అలెక్స్‌ను మరోసారి జడ్జి ముందు ప్రవేశపెట్టగా.. తెలివితక్కువగా, స్పృహలో లేకుండా దారుణానికి పాల్పడ్డానంటూ చెప్పాడు. ఈ కేసులో అలెక్స్‌ను కోర్టు దోషిగా తేల్చితే అతడికి 30 ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుంది.

సమర్థించేవారు ఎక్కువ
ప్రియుడు పురుషాంగం కత్తిరించి అలెక్స్ హల్ చల్ చేశాడు. అప్పట్లో ఈ వార్త తెగ ట్రోల్ అయ్యింది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొలా స్పందించారు. కానీ ఘటన మాత్రం దారుణం అని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు తప్పు చేస్తు శిక్ష తప్పదు అని చెప్పారు. కానీ మెజార్టీ మాత్రం సమర్థించడం విశేషం. ఈ సారి కోర్టు విచారణ సందర్భంగా అలెక్స్ అంశం చర్చకు వచ్చింది.












Click it and Unblock the Notifications