అంతరిక్షంలో 286 రోజులు- సురక్షితంగా భూమికి సునీత
Sunita Williams: భూమికి సుదూరంగా ఎక్కడో అంతరిక్ష కేంద్రంలో 286 రోజుల పాటు గడిపిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. క్షేమంగా తిరిగివచ్చారు. తోటి వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌తో కలిసి భూమండలానికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ల్యాండ్ అయ్యారు.
భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:27 నిమిషాలకు స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్ క్రూ- 9.. ఫ్లోరిడాలో గల నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడి నుంచి వారిద్దరినీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. 45 రోజుల పాటు అక్కడే రిహాబిలిటేషన్‌లో గడపనున్నారు.

ఫ్లోరిడా తీరంలో స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ నేరుగా సముద్రంలో దిగింది. లక్షలాది మంది నాసా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీన్ని వీక్షించారు. భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన కొద్ది నిమిషాలకే ఈస్టర్న టైమ్ జోన్ ప్రకారం..సాయంత్రం 5:57 నిమిషాలకు క్యాప్సూల్ సురక్షితంగా నీటిలో దిగింది. ఆ వెంటనే నాసా కంట్రోల్ రూమ్‌లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, బ్యారి విల్మోర్‌తో పాటు నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ క్యాప్సూల్‌లో ఉన్నారు. ఈ క్యాప్సుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో కొద్దిసేపు కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. నాసా దాన్ని క్షణాల్లోనే పునరుద్ధరించగలిగింది.
తొలుత నిగ్ హేగ్ నాసాను ఉద్దేశించి మాట్లాడారు. ఇదొక అద్భుత ప్రయాణంగా అభివర్ణించారు. దాదాపుగా 2,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ డ్రాగన్ క్యాప్పుల్ భూ కక్ష్యలోకి ప్రవేశించింది. సముద్ర జలాల్లోకి క్యాప్సుల్ దిగిన వెంటనే నాసాకు చెందిన రికవరీ టీమ్ అలర్ట్ అయింది. వారిని అందులో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది.
క్యాప్సుల్‌ను తెరిచిన వెంటనే ఈ నలుగుురు వ్యొమగాములు.. చిరునవ్వుతో చేతులు ఊపడం కనిపించింది. క్షేమంగా ఉన్నట్లు థమ్స్ అప్ సంకేతాలు ఇచ్చారు. అనంతరం సునీత విలియమ్స్, ఇతర ఆస్ట్రొనాట్లను హ్యూస్టన్‌కు తరలించారు.
We're getting our first look at #Crew9 since their return to Earth! Recovery teams will now help the crew out of Dragon, a standard process for all crew members after returning from long-duration missions. pic.twitter.com/yD2KVUHSuq
— NASA (@NASA) March 18, 2025
ఇప్పటివరకు పలువురు ఆస్ట్రొనాట్లు అక్కడ పరిశోధనలు నిర్వహించినప్పటికీ ఇన్ని రోజుల పాటు ఎవరూ లేరు. అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు అంటే 286 రోజుల పాటు గడిపిన రెండో వ్యోమగాములు ఇద్దరే. అమెరికాకు చెందిన ఫ్రాంక్ రూబియో, రష్యన్ వ్యోమగామి వాలెరి పోల్యాకోవ్.. సుదీర్ఘకాలం అక్కడ గడిపారు. ఫ్రాంక్ రుబియో 371 రోజులు అంతరిక్షంలో గడిపాడు. మిర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజులు గడిపాడు పొల్యాకోవ్.
-
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications