వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ తెలుసా..? ఎలుక కరిచిన కరోనా.. కానీ దానికి పాజిటివ్ ఉంటేనే.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వేరియంట్లు బెంబేలెత్తిస్తున్నాయి. వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకుతుందని తెలుసు. అందుకోసమే మూతికి మాస్క్ కంపల్సరీ అయ్యింది. కరోనా ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా, అతడి లాలాజలాన్ని తాకినా కరోనా సోకుతుందిని నిపుణులు తేల్చారు. ఎలుక కరిచినా కరోనా సోకుతుందని తేలింది. తైవాన్‌లో కట్టుదిట్టమైన బయోసేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలు కలిగిన అకాడమికా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థ జరిగిన ఆధారంగా ఈ విషయం తెలిసింది.

నెల రోజుల నుంచి ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. ఎలుక కరవడంతో తొలి కేసు వచ్చింది. సైంటిస్ట్ ల్యాబ్‌లో పనిచేస్తుండగా.. కరోనా సోకిన ఎలుక కరిచిందని తైవాన్ ఆరోగ్య శాఖ మంత్రి చెన్ షీ చుంగ్ ప్రకటించారు. ఆమె ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ కూడా తీసుకుందని చెప్పారు. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఎలుక కరవడం వల్లే కరోనా సోకిందని తేల్చామని వివరించారు. దీనికి సంబంధించి మరిన్ని టెస్టులు చేశాక దానిని నిర్ధారించాల్సి ఉందని ఓ సీనియర్ వైరాలజిస్ట్ చెప్పారు.

taiwan scientist tested positive for covid after mouse bite

అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటారు. యువ సైంటిస్ట్‌కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. ఆమెకు డెల్టా వేరియంట్ సోకిందనే అనుమానాలు వ్యక్తం అతున్నాయి.

ఇటు రెండేళ్లలో కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

English summary
taiwan scientist tested coronavirus positive. after mouse bite she infected. mouse infected virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X