విమానాన్ని కూల్చిన తాలిబన్లు: 11మంది మృతి

కాబూల్‌: అమెరికాకు చెందిన రవాణా విమానం ఒకటి ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 11 మంది మరణించారు.

సి-130 రకానికి చెందిన అమెరికన్ విమానం అర్ధరాత్రి సమయంలో కూలిపోయిందని, దీంతో అందులోని వాళ్లంతా మరణించారని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మరణించిన వారిలో ఆరుగురు అమెరికా సైనికులు కూడా ఉన్నారు.

 Taliban says shot down crashed US C-130 plane in Afghanistan

‘అసలు ప్రమాదం ఎలా జరిగింది, విమానం ఎందుకు కూలిందన్న విషయాలు మాత్రం తెలియరావడం లేదు. ఈ ఘటన గురించిన వివరాలేవీ అందడం లేదు' అని టోనీ విక్మన్ అనే ప్రతినిధి చెప్పారు.

ఇది ఇలా ఉండగా, అమెరికా విమానాన్ని కూల్చింది తామేనని తాలిబన్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ దాడిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజహిద్ ట్విట్టర్‌లో స్పందించారు. జలాలాబాద్‌లో తమ ఉగ్రవాదులే ఆ విమానాన్ని కూల్చేశారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+