వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్, ఫేస్‌బుక్ ఇన్స్‌టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు..నిలిచిపోయిన సేవలు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్‌ల సేవలకు బుధవారం ఉదయం నుంచి అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఇక ఫేస్‌బుక్,వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్ యాప్‌లలో బగ్స్ ఉన్నట్లు చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఫేస్‌బుక్ వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్‌లో ఈ తరహా సమస్యలు ఒక్క అమెరికాలోనే తలెత్తలేదని లండన్, బెర్లిన్‌లో కూడా ఉత్పన్నమయ్యాయని తెలుస్తోంది. ఫ్లోరిడా, జార్జియా, సౌత్ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా సేవలకు అంతరాయం ఏర్పడినట్లు డౌన్ డిటెక్టర్ అనే సంస్థ వెల్లడించింది. భారత్‌లో కూడా గత రెండ్రోజులుగా ఫేస్‌బుక్‌లో సమస్యలు వచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఇక వాట్సాప్‌లో చాట్ మెసేజెస్ వరకు వస్తున్నాయని అయితే ఆడియో లేదా వీడియో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు అవి ఫ్రీజ్ అయిపోతున్నాయి.

ఫైల్స్ మాత్రం ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్లే కనిపిస్తున్నాయి కానీ వెళ్లాల్సిన వ్యక్తి ఫోనుకు చేరడం లేదు. ఇందులో ఏదో సర్వర్ బగ్ ఉన్నట్లు సాంకేతిక బృందం గుర్తించింది. ఒక వేళ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ అయినప్పటికీ అవి డౌన్‌లోడ్ కావడం లేదని నిపుణుల బృందం చెబుతోంది. అయితే దీనిపై వాట్సాప్, ఇన్స్‌టాగ్రామ్‌లను నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ సంస్థ ఇప్పటి వరకు స్పందించలేదు. ఏదైనా సైబర్ అటాక్‌లాంటిది జరిగిందా అనే అనుమానం సాంకేతిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

facebookk

ఇక వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటల నుంచి గంటపాటు సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్‌లో కేవలం మెసేజ్‌లు మాత్రమే వెళుతున్నాయి కానీ ఇతర ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ కాలేదు. ఈ సమస్య స్కాట్‌లాండ్, జింబాబ్వేలో కనిపించినట్లు అధికారులు తెలిపారు.ఇక యూరప్ అమెరికాలో పూర్తిస్థాయిలో సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. అయితే తిరిగి సేవలు ఎప్పుడు పునరుద్ధమవుతాయో అనేదానిపై స్పష్టత లేదు.

English summary
WhatsApp, Instagram and Facebook's services are seemingly experiencing technical glitches since earlier today. The outage appears to be global, with media reports and tweets revealing that the issue is prevalent across Europe, USA and Africa as well. In India, while the WhatsApp chat interface and Instagram posts and stories are active, transferring any form of media, including audio and images, appear to be frozen for now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X