అమ్మాయితో డేటింగ్ కు వెళ్ళి పరిహరం కోసం కోర్టుకెళ్ళాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆస్టిన్:ఆన్ లైన్ లో పరిచయమైన అమ్మాయిని డేట్ కు పిలిచాడు. అయితే ఆమె సరేనని ఒప్పుకొంది. ఆమెను సరదాగా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమాకు తీసుకెళ్ళాడు. అయితే సినిమా పూర్తైన వెంటనే తనతో డేటింగ్ కు వచ్చిన అమ్మాయిపై కేసు వేశాడు ఆ యువకుడు.

అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్ లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.జైలుకు పంపాల్సిందే అంటూ నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. ఆస్టిన్ కు చెందిన బ్రెండన్ వెజ్మెర్ అనే యువకుడికి ఆన్ లైన్ లో ఓ అమ్మాయి పరిచయమైంది.

dating

ఇద్దరూ కలిసి మే 6న, డేటింగ్ కు వెళ్ళారు. అతని మొట్టమొదటి డుట్, వాళ్ళిద్దరూ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సినిమా చూస్తుండగా ఆమె ఫోన్ కు మేసేజ్ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై ఇచ్చింది. ఇలా 20 మేసేజ్ లు వచ్చాయి. వాటన్నింటికి ఆమె రిప్లై ఇచ్చింది. పక్కనే కూర్చొన్న బ్రెండన్ కు ఈ మేసేజ్ లతో చిర్రెత్తుకు వచ్చింది.

తన డబ్బులతో సినిమాకొచ్చి, తన పక్కనే కూర్చొన్న ఆమె వరుసగా మేసేజ్ లు పంపుతూ సినిమా చూడాలన్న తన హక్కును కాలరాసింది. హలులో మొబైల్ వాడటం థియేటర్ పాలసీకి వ్యతిరేకం కూడ అని బ్రెండన్ కోర్టును ఆశ్రయించారు. డేట్ కోసం ఖర్చు చేసిన రూ.17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్ ద్వారా అమ్మాయిని డిమాండ్ చేశారు.అయితే అమ్మాయిని డేట్ కు తీసుకెళ్ళడమే కాకుండా, ఆమె మీద దావా వేసిన బ్రెండన్ చర్యను వెర్రితనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Texas man is demanding a refund from his date after she texted while they were at the movies in Austin.Brandon Vezmar filed a petition at a small claims court seeking $17.31 in damages.
Please Wait while comments are loading...