యుద్ధం అంచున మరో 2 ఆసియా దేశాలు!

Thailand Cambodia Conflict: రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్, ఇజ్రాయెల్-హమాస్ తర్వాత ఇప్పుడు మరో 2 ఆసియా దేశాలు యుద్ధం బారిన పడ్డాయి. థాయ్‌లాండ్ , కంబోడియా దేశాల మధ్య చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మళ్లీ తీవ్రమైంది. అందిన సమాచారం ప్రకారం.. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. అదే సమయంలో థాయ్‌లాండ్ వైమానిక దళం కంబోడియాలోని రెండు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో కంబోడియా సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. థాయ్‌లాండ్ వైమానిక దళం ఈ వైమానిక దాడులను ఎఫ్-16 జెట్‌లతో నిర్వహించింది. దాడులకు ముందు ఈ ఉదయం రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దులో తీవ్ర ఘర్షణ కూడా జరిగింది. కంబోడియా దాడిలో థాయ్‌లాండ్‌లోని ఒక గ్యాస్ స్టేషన్ ధ్వంసమైంది. దీని తర్వాత అనేక మీడియా నివేదికలలో థాయ్‌లాండ్ కంబోడియాపై వైమానిక దాడులు చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రాణాలు కాపాడుకునేందుకు నేలపై పడుకున్న సైనికులు
థాయ్‌లాండ్‌లోని గ్యాస్ స్టేషన్‌పై కంబోడియా బీఎం-21 రాకెట్‌తో దాడి చేసింది. దీంతో బ్యాంకాక్‌లో కలకలం రేగింది. ప్రాణాలు కాపాడుకోవడానికి సైనికులు అనేక చోట్ల నేలపై పడుకుని ఉన్నారు. ఈ సమయంలో చాలా మంది ప్రజలు గాయపడినట్లు నివేదికలు వస్తున్నాయి. ఇప్పటివరకు అందిన ధ్రువీకరించని నివేదిక ప్రకారం.. ఈ ఘర్షణలో ఇద్దరు మరణించారు. చాలా మంది పాఠశాల పిల్లలు, సాధారణ పౌరులు గాయపడ్డారు.

Thailand Cambodia Border War F-16 Airstrikes and Rocket Attacks Escalate Tensions

అమెరికా తన పౌరుల కోసం అడ్వైజరీ జారీ
థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా రాయబాయ కార్యాలయం తన పౌరుల కోసం భద్రతా అడ్వైజరీని జారీ చేసింది. థాయ్‌లాండ్‌లోని అమెరికా కాన్సులేట్ తన పౌరులకు జులై 24న థాయ్‌లాండ్, కంబోడియాలో రాకెట్, ఆర్టిలరీ గన్‌లతో దాడులు జరిగినట్లు సమాచారం అందిందని వెల్లడించింది. కాబట్టి, సరిహద్దు ప్రాంతాలలో ఉన్న అమెరికా పౌరులందరికీ ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని, థాయ్‌లాండ్ ప్రభుత్వ అడ్వైజరీని పాటించాలని సలహా ఇచ్చారు.

కంబోడియా రక్షణ ప్రతినిధి జనరల్ మాలి సోచెటా మాట్లాడుతూ.. థాయ్ సైనికుల చొరబాటు తర్వాత తాము ప్రతీకార చర్యలు తీసుకున్నామని చెప్పారు. కంబోడియా ప్రధాని మాట్లాడుతూ.. థాయ్‌లాండ్ తమ ఓదార్ మీంచే, ప్రేయ విహార్ ప్రావిన్స్‌లలోని ఆలయాలు, సైనిక స్థావరాలపై దాడి చేసిందని అన్నారు. తాము ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటున్నామని ఆయన అన్నారు. నివేదిక ప్రకారం, గురువారం జరిగిన కంబోడియా దాడిలో ఇద్దరు థాయ్ సైనికులు మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+