అణ్వాయుధాలకు భయపడి.. భూమికి 26 అడుగుల కింద ‘లగ్జరీహౌస్’

అణ్వాయుధ ప్రయోగం జరిగి భూమ్మీద నివశించడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడతాయని భావించిన ఓ వ్యక్తి తన ఇంటి కిందనే 26 అడుగుల లోతున సకల సౌకర్యాలతో ఓ గృహాన్ని నిర్మించుకున్నాడు.

లాస్ వెగాస్: మూడో ప్రపంచ యుద్ధమే గనుక సంభవిస్తే.. అగ్రరాజ్యాలు పంతానికి పోయి అణ్వాయుధాలే గనుక జార విడిస్తే.. అణుశక్తి ప్రభావంతో భూమిపై మనుషులు జీవించడానికి వీల్లేని పరిస్థితులే గనుక ఏర్పడితే... ఆ తరువాత ఎలా బ్రతకడం?

సరిగ్గా ఇలాంటి ఆలోచన మూడు దశాబ్దాల క్రితమే ఓ పెద్ద మనిషికి వచ్చింది. దీంతో ఆయన తన ఇంట్లోనే భూమికి 26 అడుగుల లోతున ఓ లగ్గరీ హౌస్ నిర్మించుకున్నాడు. ఇదంతా 1970 నాటి సంగతి.

అప్పట్లో అమెరికా, రష్యా నడుమ కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో అణుబాంబు ప్రయోగాలు జరిగి భూమి సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాన్ని చూసుకోవాలని, సరిపడా ఆహార పదార్థాలను దాచుకోవాలని అమెరికా ప్రభుత్వం తన పౌరులను హెచ్చరించింది.

దీంతో అమెరికాలోని లాస్ వెగాస్ కు తూర్పున ఉన్న సబర్భన్ స్ట్రీట్ కు చెందిన గిరార్డ్ బ్రౌన్ హెండర్సన్ అనే వ్యాపారవేత్త భయపడిపోయాడు. వెంటనే తన ఇంటి కిందనే 26 అడుగుల లోతున భూగర్భంలో లగ్గరీ ఇంటిని నిర్మించుకున్నాడు.

The Cold War Bunker That Offered Subterranean Suburbia Below Las Vegas

5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్ రూంలు, కిచెన్, బాత్రూంలు, స్విమ్మింగ్ పూల్, గార్డెన్, లాన్, వాటర్ ఫాల్, గోల్ఫ్ కోర్స్.. ఇలా సర్వ సదుపాయాలతో అద్భుతంగా కట్టించుకున్నాడు.

సదరు లగ్జరీ హౌస్ లో రాత్రి, పగలు తేడా తెలిసేలా సమయాన్ని బట్టి వెలుతురు వచ్చేలా ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కొన్ని ఏళ్లపాటు జీవించడానికి సరిపడా సరుకులు కూడా సమకూర్చుకున్నాడు.

తీరా చూస్తే కోల్డ్ వార్ ముగిసిపోయింది. అణ్వాయుధ ప్రయోగం జరగనే లేదు. అయితే హెండర్సన్ మాత్రం ముచ్చట పడి నిర్మించుకున్న సదరు భూగృహంలోనే నివశించాడు. 1983లో అతడు మరణించిన తరువాత ఆ లగ్జరీ హౌస్ ను అతడి బంధువులు స్వాధీనం చేసుకున్నారు. 2014 లో 'సొసైటీ ఫర్ ర ప్రజర్వేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎక్సిటిక్ట్ స్పీసెస్'అనే సంస్థ ఈ ఇంటిని కొనుగోలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+