Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిన్న కారణం.. అతిపెద్ద శిక్ష..! పాకిస్తాన్ లో దారుణాతి దారుణమైన దుశ్చర్య..!

ఇస్లామాబాద్/హైదరాబాద్ : కొన్ని దేశాల్లో మరణ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. కాకపోతే ముద్దాయిలు చేసే తప్పులను బట్టి శిక్షలలోని కఠినత్వం అమలుచేస్తుంటారు. కాని పాకిస్తాన్ లో చోటుచేసుకున్న ఓ శిక్షకు సంబందించిన అంశాన్ని తెలుసుకుంటే మాత్రం ఒళ్లు జలదరించక మానదు. అత్యంత హృదయ విదారకమైన ఘటన ఇద్దరు అమ్మాయిల పాశవిక హత్యలు వెలుగులోకి తెచ్చింది. ఈ విషాద ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ప్రపంచంలో ఎక్కడా జరగని ఇలాంటి ఆకృత్యాలన్నీ కూడా ఈ పాకిస్తాన్ దేశంలోనే జరుగుతాయి. ఉగ్రవాదం, కుల వివక్ష, హత్యలు.. ఇలా ఒకటేమిటి అక్కడ జరిగేవన్నీ కూడా సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉంటాయి. తాజాగా అక్కడ జరిగిన ఓ దారుణ ఘటన సభ్య దేశాలను నెవ్వరపోయేలా చేసింది. అబ్బాయితో మాట్లాడారని ఇద్దరు అమ్మాయిలను దారుణంగా హత్య చేశారు వారి బంధువులు.

The smallest reason..the biggest punishment.!The worst nightmare in Pakistan.!

ఇదిలా ఉండగా పోలీసుల కధనం ప్రకారం, పాకిస్తాన్‌లోని ఉత్తర వాయువ్య గిరిజన ప్రాంతంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం పదహారు, పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికల హత్యకు గురయ్యారు. ఆ ఇద్దరు అమ్మాయిలను వారి కుటుంబసభ్యులే హతమార్చారని ప్రాధమిక విచారణలో తేలింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు బాధితుల్లో ఒకరి తండ్రి కాగా, మరొక బాధితురాలి సోదరుడు అని నిర్ధారించారు పోలీసులు. తాజాగా ఏడాది క్రితానికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అందులో ఓ అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలతో కలిసి మాట్లాడుతున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక వీడియోలోని ఇద్దరు అమ్మాయిలను వారి కుటుంబసభ్యులు దారుణంగా హత్య చేశారు. ఇక ఆ వీడియోలో ఉన్న మూడో అమ్మాయి ప్రస్తుతం బ్రతికే ఉందని, ఆమె ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మూడో అమ్మయికి రక్షణ కల్పించే పనిలో పడ్డారు పాక్ పోలీసులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+