US Election: నేడు అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు.. భారతీయులు ఎటువైపు..!
యావత్ ప్రపంచం అమెరికా ఎన్నికలపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరి కొద్ది గంటల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 6 కోట్లకు పైగా ప్రజలు ముందస్తు ఓట్లు వేశారు. దీంతో ఈసారి భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూఎస్ ప్రధానంగా రెండు పార్టీలో మధ్యే పోటీ ఉంటుంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ పోటీ పడుతుండగా.. డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ అధ్యక్ష రేసులో ఉన్నారు.
అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమై.. బుధవారం ఉదయం వరకు కొనసాగుతోంది. అమెరికాలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

ఈ ఎన్నికలను నవంబర్ మొదటి మంగళవారమే నిర్వహిస్తారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా నవంబర్ మొదటి వారమే పోలింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించి 1845లో చట్టం చేశారు. అమెరికాలో పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వస్తాయి. అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో 238 ఎలక్టోరల్స్ ఉంటారు. 270 ఎలక్టోరల్స్ వచ్చిన వారు అధ్యక్షుడిగా ఉంటారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్క రకంగా ఎలక్టోరల్స్ ఉంటారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్స్ ఉండగా.. వ్యోమింగ్‌కు మూడు ఎలక్టోరల్స్ ఉన్నాయి.
ఫలితాల తర్వాత ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎంపిక చేస్తారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరూ 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని ఎన్నుకుంటారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భారత సంతతి మహిళగా ఉన్నారు. భారతీయులు ఎక్కువ శాతం ఆమెకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే భారతీయులకు మేలు జరుగుతుంది..?#DonaldTrump #KamalaHarris #USElection2024 #USPresidentialElection2024 #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) November 5, 2024













Click it and Unblock the Notifications