ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ ఏదో తెలుసా..?

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ కే కాదు.. ప్రపంచ దేశాలకూ భారత్ షాక్ ఇచ్చింది. భారత్ ఆయుధాలను చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు అవాక్కైతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో రక్షణ రంగంలో భారత్ సూపర్ స్ట్రాంగ్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 21వేల కోట్ల విలువైన ఆయుధ సామాగ్రిని భారత్ దిగుమతి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరింత అత్యాధునిక రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని భారత్ ప్రణాళిక వేస్తోంది.

అయితే కేవలం దిగుమతులే కాకుండా ఎగుమతుల్లోనూ భారత్ సత్తా చాటుతోంది. దాదాపు 100 దేశాలకు మన ఆయుధ సామాగ్రిని ఎగుమతి చేసింది భారత్. భారత్ ఎగుమతుల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా లాంటి దేశాలు ఉండటం భారత్.. డిఫెన్స్ పరంగా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతోంది. రక్షణ సామాగ్రి ఎగుమతి ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా మారుతోంది.

The World s Most Powerful Military Who Holds the Top Spot

అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ గా భారత ఆర్మీ దూసుకెళ్తోంది. అమెరికా, రష్యా లాంటి దేశాలను భారత్ దాటేసింది. తాజాగా స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(సిప్రీ) ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగానికి వ్యయం పెరిగింది. ఉగ్రవాదం, సైబర్ ఎటాక్స్ ఇతర విపత్తుల కారణంగా అనేక దేశాలు ఇప్పుడు తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. భారత్ కూడా తన ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచినట్లు సిప్రీ తన నివేదికలో పేర్కొంది.

ఇక 2025 లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఏదో చెప్పేసింది సిప్రీ. ఈ లిస్టులో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు అమెరికా పవర్ ఇండెక్స్ 0.0744 తో టాప్ ప్లేస్ లోఉంది. ఆర్మీ సంఖ్య 20 లక్షల 35 వేలుగా ఉంది. ఇక రెండో స్థానంలో రష్యా ఉంది. రష్యా పవన్ ఇండెక్స్ 0.0788గా ఉంది. రష్యా ఆర్మీ సంఖ్య 35లక్షల 67 వేలుగా ఉంది.

ఇక చైనా మూడో స్థానంలో ఉంది. చైనా పవర్ ఇండెక్స్ 0.0788 గా ఉంది. చైనాలో సైన్యం సంఖ్య 31 లక్షల 70 వేలుగా ఉంది.ఇక నాలుగో స్థానంలో భారత్ ఉంది. భారత్ సైన్యం 51 లక్షల 37 వేల 550 మంది. ఇక ఐదో స్థానంలో దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా పవర్ ఇండెక్స్ 0.1656 గా ఉంది. ఆర్మీ సంఖ్య 38 లక్షల 20 వేలుగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యూకే, ఫ్రాన్స్, జపాన్ ఉన్నాయి. పాకిస్థాన్ టాప్ 10 స్థానాల్లో లేదు. పాక్ 12 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ పవర్ ఇండెక్స్ 0.2513గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+