ఆశ్చర్యం: కాలిఫోర్నియాలో నిమ్మకాయలు దొంగిలించి అరెస్టయ్యాడు
కాలిఫోర్నియా: ఓ వ్యక్తి నిమ్మకాయలు దొంగిలించి అరెస్టయ్యాడు. ఈ ఆసక్తికర సంఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. అతను 362 కిలోల నిమ్మకాయలు దొంగిలించాడు. 69 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అతని పేరు డియోన్సియో ఫియెర్రోస్.
అతను తన వాహనంలో నిమ్మకాయలను తీసుకు వెళ్తుండగా గుర్తించారు. ఈ సంఘటన ఆగస్ట్ 24వ తేదీన ఉదయం జరిగింది. పోలీసులు అతని వాహనాన్ని తనిఖీ చేసి పెద్ద ఎత్తున నిమ్మకాయలు గుర్తించారు. అతను వాటిని సమీపంలోని పొలాల నుంచి దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించారు.

నిమ్మకాయలను తాను దొంగిలించానని అతను పోలీసులకు చెప్పాడు. అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా కాలిఫోర్నియాలో వ్యవసాయ క్షేత్రాల్లో జరిగే దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇలాంటి దొంగతనం ఇదే మొదటిది కాదు. గతంలో ఓ వ్యక్తి 4వేల కిలోల నారింజ పండ్లను చోరి చేశాడు. పోలీసులు అతనిని అప్పుడు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications