విమానంలో విచిత్రం: ఎయిర్ హోస్టెస్ కు పైలట్ లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్
ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ప్రస్తుతం ఓ జంట లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి విపరీతంగా షేర్ అవుతోంది.
ఓ జంట లవ్ ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. విమానంలో ప్రయాణిస్తుండగా పైలట్ చేసిన లవ్ ప్రపోజల్ వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో స్పష్టతలేదు కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఎయిర్ హోస్టెస్‌లు తమ విధుల్లో మునిగిఉండగా ఓ పైలట్ అక్కడకు వచ్చాడు. విమానంలో ఉండే ఫోన్ లో ఏదో విషయం చెప్పగానే ఓ ఎయిర్ హోస్టెస్ అతడివైపు కదిలింది.

ఇంతలో అతడు మోకాళ్లపై కూర్చుని 'నన్ను పెళ్లి చేసుకుంటావా..' అని అడిగాడు. ఆమె చేతిని పట్టుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పి.. ఆమె కళ్లలోకి చూస్తూ.. 'జీవితాంతం ఈ చేతిని వదలను..' అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు.
పైలట్ చొరవకు మొదట ఆమె ఆశ్చర్యచకితురాలైనా.. ఆపైన అతడి ప్రపొజల్ కు ఒకే చెప్పింది. సినిమాలో సీన్ లా ప్రయాణికులందరూ చూస్తుండగానే పైలట్, తన ప్రియురాలికి రింగ్ తొడిగి తన ప్రేమను గెలిపించుకున్నాడు.
ఆ తరువాత విమానంలో అందరూ చప్పట్లు కొడుతుండగా ఆ ప్రేమికులిద్దరూ కౌగిలించుకుని ముద్దుల్లో మునిగితేలారు. ఆ వెంటనే విమానంలోని ఫోన్ తీసుకుని తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఎయిర్ హోస్టెస్ తన సంతోషాన్ని షేర్ చేసుకుంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications