ఏమి అధ్యక్షుడురా బాబూ: ట్రంపు బూటుకు టాయ్‌లెట్ పేపర్..ఛీఛీ అంటున్న నెటిజెన్లు
Recommended Video

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి అదేదో గొప్ప నిర్ణయాలు తీసుకున్నందుకో.... లేక మరొకటో సాధించినందుకు కాదు. అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కినందుకు వార్తల్లో నిలిచాడు. ఇదేంటి... విమానం ఎక్కితే అందులో వింతేముంది అనేగా మీ డౌటు..? విమానం ఎక్కడం సర్వ సాధారణమే... కానీ ట్రంప్ ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజెన్ల దగ్గర నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమానం ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... ట్రంప్ ధరించిన బూట్లకు ఓ టాయ్‌లెట్ పేపర్ అంటుకుంది. ఒక అధ్యక్షుడు బూటుకు టాయ్‌లెట్ పేపర్ అంటుకుని అది ఆయన గమనించకపోవడం.. తన అధికారిక నివాసం నుంచి విమానాశ్రయం వరకు అలానే రావడం చూస్తే ట్రంప్ పరిశుభ్రత ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. అయితే అది టాయ్‌లెట్ పేపరా మరో పేపరా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఇంటర్నెట్‌లో మాత్రం చాలామంది అది టాయ్‌లెట్ పేపరే అని చెబుతున్నారు.

ఇక విమానం ఎక్కేంతవరకు ఆ టాయ్‌లెట్ పేపర్ ట్రంప్ బూటునే అంటుకుని ఉంది. విమానం మెట్లు ఎక్కాక ట్రంప్ అధికారులకు అభివాదం చేసి విమానం లోపలికి వెళ్లే సమయంలో ఈ టాయ్‌లెట్ పేపర్ బూటునుంచి వేరయి బయటపడింది. ఈ హిలేరియస్ మూవ్‌మెంట్‌ను అక్కడి కెమెరాల కంటికి చిక్కాయి. ఇది కాస్త సోషల్ మీడియలో వైరల్ అవడంతో నెటిజెన్లు తమకు ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టారు. ఒక చెత్తను మరో చెత్త అంటుకుందని ఒకరు ట్వీట్ చేయగా... ట్రంప్ పరిపాలన ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చంటూ మరొకరు ట్వీట్ చేశారు.
WATCH: President Trump boards Air Force One with what appears to be toilet paper stuck to his shoe pic.twitter.com/A0AEYXXlXq
— Joel Franco (@OfficialJoelF) October 5, 2018












Click it and Unblock the Notifications