టోర్నడో బీభత్సం- 100 మంది పైగా మృతి : అత్యవసర పరిస్థితి విధింపు..!!

అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో (సుడిగాలు) బీభత్సం సృష్టిస్తున్నాయి. టోర్నడో ధాటికి సుమారు మంది 100 ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆండీ బెషీర్​ తెలిపారు. రాష్ట్రంలో 300 కిలోమీటర్లకుపైగా పొడవున అనేక కౌంటీల్లో ఈ సుడిగాలి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు. ఓ క్యాండిల్​ ఫ్యాక్టరీలో పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు.కెంటనీ చరిత్రలో శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనదిగా అభివర్ణించారు గవర్నర్​. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు.

సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని, స్థానికంగా ఉండే పోలీసులు, ప్రభుత్వం ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. అంతకుముందు భీకర గాలుల కారణంగా ఇల్లినాయిస్‌ ఎడ్వర్డ్స్‌విల్లేలోని ఓ భారీ అమెజాన్ గోదాం ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 100 మంది కార్మికులు లోపల చిక్కుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వారిని రక్షించేందుకు అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు.

Tornado devastation in US: 100 feared dead in Kentucky state

ఇక్కడి కాలిన్స్‌విల్లే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ దీన్ని భారీ ప్రమాద సంఘటనగా అభివర్ణించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, చనిపోయారా అనేది స్పష్టత రాలేదు. ఇల్లినాయిస్ స్టేట్ పోలీస్, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, స్థానిక అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారని, తానూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు గవర్నర్‌ జేబీ ప్రిట్జర్‌ తెలిపారు. మరోవైపు అర్కాన్సస్‌లో ఒకరు, టెన్నెసీలో ఇద్దరు ఈ తరహా ఘటనల్లోనే మృతి చెందారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్​ ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా అత్యవసర పరిస్థితి ప్రకటించినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+