ఏమిటీ ఘోరం.. పాకిస్థాన్ లో 450 స్కూల్స్ లో పేలిన బాంబులు..!
పాకిస్థాన్ లో చిన్నారులు, యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఎప్పుడు ఏవైపు నుంచి బాంబు పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. తాజాగా పాక్ లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లోని ఓ హైస్కూల్ పై బాంబు దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ బాండు దాడికి పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం(జూన్ 06) ఉదయం ఈ దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ టాంక్ జిల్లాలోని గుల్ ఇమామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బారీ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. అక్బారీ గ్రామంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్ పై దుండగులు జరిపిన బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. స్కూల్ లోని గదులు ధ్వంసం అయ్యాయి. అయితే తామే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రీక్-ఈ- తాలిబాన్(TTP ) అనే ఉగ్రవాద సంస్థ టాంక్ జిల్లాలో యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థే దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది.
#Breaking | Pakistan govt school bombed
— TIMES NOW (@TimesNow) June 6, 2025
- High school attacked in Pakistan
- Khyber Pakhtunkhwa school blown up
- TTP active in Pakistan's Tank district@SaahilSuhail joins @Swatij14 with details. pic.twitter.com/eES2CYIJyj
స్థానిక ఎన్జీఓలు అందించిన సమాచారం మేరకు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో గత పదేళ్లలో 450 పాఠశాలలపై బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు పాఠశాలలకు హాజరు కాకుండా ఇలా చేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. 2019 వరకు పాకిస్థాన్ లోని అనేక గర్ల్స్ స్కూళ్లపై దాడులు జరిగాయి. స్వాట్ వ్యాలీతో పాటు నార్త్ వెస్ట్ పాకిస్థాన్ ప్రాంతంలో ఈ దాడులు అధికంగా నమోదయ్యాయి.

ఇటీవల పాక్ లో ఓ స్కూల్ బస్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. ఇక 2012లో పాఠశాలలపై బాంబు దాడులను ఖండించి.. విద్యార్థుల్లో విద్య పై అవగాహన కల్పించిన మలాలా యూసఫ్ జాయ్ కు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications