వైరల్ వీడియో: గాల్లోనే ఒకదాన్నొకటి ఢీ కొన్న ఫ్లయింగ్ కార్లు
చైనాలో నిర్వహించనున్న ఎయిర్ షో లో విషాదం నెలకొంది. రెండు ఫ్లయింగ్ కార్లు ఒకదాన్నొకటి ఢీ కొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఎయిర్ షో కోసం రిహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాల్లోనే రెండు ఎయిర్ కార్లు ఢీ కొట్టుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి రెండు కార్లు కిందపడ్డాయి. ఈ కార్లను చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ ఎక్స్ పెంగ్ తయారు చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

చైనాలో ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న ది చాంగ్ చన్ ఎయిర్ షో-2025 లో విషాదం నెలకొంది. ఈ ఎయిర్ షో లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలు కంపెనీలకు ఫ్లయింగ్ కార్లు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ఆయా కంపెనీల ఎలక్ట్రిక్ ఎయిర్ కార్లు రిహార్సల్స్ చేస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రెండు ఫ్లయింగ్ కార్లు అనుకోకుండా ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఫ్లయింగ్ కారు పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సేఫ్టీ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
长春航展两架飞行汽车在空中相撞坠落起火!9月16日,长春航展预演结束后,广东汇天通航参与双机编队演练期间。两架eVTOL(电动垂直起降飞行器)在空中相撞后坠机,在地面燃起大火... pic.twitter.com/pYWqziAHUD
— 希望之聲 - 中國時局 (@SoundOfHope_SOH) September 17, 2025
ప్రమాదానికి గురైన రెండు ఫ్లయింగ్ కార్లు ఎక్స్ పెంట్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి చెందినవిగా గుర్తించారు. ఈ కార్ల కంపెనీని 2013లో ప్రారంభించారు. ది ది చాంగ్ చన్ ఎయిర్ షో-2025 ఎయిర్ షో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుండగా ఈ లోపే ఇలాంటి ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమాదం జరిగాక ఓ కారు సురక్షితంగానే ల్యాండింగ్ అయింది. మరో కారు మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలిలోని సిబ్బంది అంతా సేఫ్ గానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications