అదంతా హిల్లరీ పన్నిన కట్ర : ట్రంప్
ఫ్లోరిడా : ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలతో తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్న ట్రంప్.. తిరిగి తన పొలిటికల్ మైలేజ్ ను నిలబెట్టుకునేందుకు ఎన్నికల ర్యాలీలను బాగానే ఉపయోగించుకుంటున్నారు. హిల్లరీని గెలిపించడం కోసం ఒక వర్గం మీడియా, కొన్ని కార్పోరేట్ శక్తులు ఉద్దేశ్యపూర్వకంగానే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయని మండిపడుతున్నారు ట్రంప్.
ఇవే అంశాలను ప్రస్తావిస్తూ.. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ హిల్లరీపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్నది జర్నలిజం కాదని, కార్పోరేట్ సంస్థల చేతుల్లో ఉన్న మీడియా, పత్రికలు ప్రత్యేక ఆసక్తితో హిల్లరీ గెలుపు కోసం ఒక లాబీయిస్టు ఆర్థిక సంస్థ లాగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఎన్నికల కోసం హిల్లరీ క్లింటన్ పన్నిన కుట్ర అని ఆరోపించారు ట్రంప్.

మరోసారి ఉద్యోగాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు :
అమెరికన్ యువతకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను తాను కాపాడుతానని హామి ఇచ్చార ట్రంప్. 'ఇది మనదేశం మనుగడ కోసం జరుగుతోన్న పోరాటం.. నన్ను నమ్మండి, దేశ మనుగడను కాపాడుకోవాలనుకుంటే నవంబర్ 8 మనకు చివరి అవకాశం అన్న సంగతి మరిచిపోవద్దు' అంటూ ఎన్నికల ర్యాలీలో అమెరికన్ యువతను ఉద్దేశించి మాట్లాడారు ట్రంప్.
అమెరికా ఒక స్వతంత్ర దేశమా?, అక్కడ ప్రజాస్వామ్యమనే భ్రాంతి మాత్రమే ఉందా?, లేక వాస్తవానికి వ్యవస్థను నాశనం చేసే కొన్ని అంతర్జాతీయ ప్రయోజనాలు కలిగిన శక్తుల చేతుల్లో దేశం ఉందా? అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక మరోసారి హెచ్-1బీ వీసాల ప్రస్తావనను లేవనెత్తిన ట్రంప్.. అమెరికన్ కంపెనీలు వర్కింగ్ వీసాలపై చాలా తక్కువ మొత్తంలో వేతనాలకు ఉద్యోగులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని ఆరోపించారు.
'అమెరికన్ యువతకు ఉద్యోగాలు దొరకట్లేదనే ఆందోళనలో చాలామంది అమెరికన్ తల్లులున్నారు. వారి ఆందోళనకు ప్రధాన కారణం ఔట్ సోర్సింగ్. కాలేజీల్లో చదువుకున్నవారికి దక్కాల్సిన ఉద్యోగాలను ఇతర దేశాల వారికి ఇస్తున్నారు' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే.. అమెరికన్లకు దక్కాల్సిన న్యాయమైన ఉద్యోగాలను కాపాడి తీరుతానని చెప్పుకొచ్చారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications