Trump: "ట్రంప్" స్వింగ్ విక్టరీ - తొలి హెచ్చరిక..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలుపొందారు. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో కమలా హరీస్ పైన విజయం సాధించారు. ఫలితాల పైన ట్రంప్ హర్షం వ్యక్తం చేసారు. అమెరికా ప్రజలు పవర్ ఫుల్ తీర్పు ఇచ్చారన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. సరిహద్దుల మూసివేత పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరైనా చట్టబద్దంగానే దేశంలోకి రావాలని తేల్చి చెప్పారు. ఎలాన్ మస్క్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
తొలి ప్రసంగంలో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. తన కోసం పని చేసిన మద్దతు దారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసగించారు. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నాం అని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారన్నారు. అమెరికా ప్రజల కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికాకు స్వర్ణ యుగం తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తరువాత ట్రంప్ తన మద్దతు దారులతో ఉద్వేగ పూరిత ప్రసంగం చేసారు. పలు హామీలు ఇచ్చారు. దేశ భద్రత..వలసలు.. చొరబాట్ల పైన తన వైఖరి స్పష్టం చేసారు. అమెరికాకు భవిష్యత్ స్వర్ణ యుగంగా మారుస్తానని మాట ఇచ్చారు.

ట్రంప్ మేజిక్ తో
స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ హవా కొనసాగింది. అధ్యక్షుడిని ఖరారు చేసే స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ తొలి నుంచి ఆధిక్యత కొనసాగించారు. ఒక దశలో కమలా సైతం దూకుడు పెంచారు. ఇద్దరి మధ్య ఓట్ల శాతం హోరా హోరీగా మారింది. కానీ, అందరి అంచనాలను తల కిందులు చేస్తూ రిపబ్లికన్ల పట్టు ఉన్న రాష్ట్రాల్లో గతం కంటే ఎక్కవ ఓట్లు ట్రంప్ సాధించారు. ట్రంప్ తో నిర్వించిన సమావేశంలో కెనడీ జూనియర్, మాస్క్ తో సహా పలువురు మద్దతు దారులు హాజరు అయ్యారు. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ మేజిక్ పని చేసింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపొందారు.
అమెరికా ప్రజల కోసం
అమెరికన్ సెనెట్‌లో 100 స్థానాలకు గాను ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ 51, డెమోక్రటిక్ పార్టీ 42 స్థానాలను కైవసం చేసుకున్నాయి. మరో 7 స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇక్కడ మెజార్టీ సీట్లను రిపబ్లికన్ పార్టీ సాధించడంతో సెనెట్ లో పూర్తి ఆధిక్యత సాధించారు. నార్తర్న్ వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత అమెరికన్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా పని చేశారు. ఇల్లినోయీ రాష్ట్రాన్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవటంతో రిపబ్లికన్స్ ఖుషీ అవుతున్నారు. జనవరి 20న 67వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు.

-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications