Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాల్లో ముద్దులాట.. డేంజరస్ స్టంట్..! యువజంటపై మండిపడ్డ నెటిజన్లు

బాలి : అమెరికాకు చెందిన ట్రావెల్ బ్లాగర్స్ జంట డేంజరస్ స్టంట్ బిల్డప్ ఇచ్చింది. దాని తాలూకు ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో దుమారం రేగింది. కెల్లీ, కొడీ అనే యువజంట బాలిలో నివాసముంటోంది. ఉబుడ్ లోని కేయాన్ జంగిల్ రిసార్ట్ లో వీరిద్దరు చేసిన లిప్ లాక్ స్టంట్ పై నెటిజన్లు ఫైరయ్యారు. ప్రాణాలకు తెగించి ఇలాంటి ఫీట్లు అవసరమా అంటూ కామెంటుతున్నారు.

గాల్లో తేలినట్లుందే..!

ఇంతకు ఆ డేంజరస్ స్టంట్ బిల్డప్ ఏంటంటే.. భూమినుంచి కొన్ని అడుగుల ఎత్తులో ఒక స్విమ్మింగ్ పూల్. అందులో అతను నిలుచున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆమె గాల్లో తేలుతూ అతడికి అధరామృతం అందిస్తోంది. అయితే ఏదో ఘనకార్యం చేసినట్లుగా.. ఈ డేంజరస్ స్టంట్ బిల్డప్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి నెటిజన్లు ఒక్కో రకంగా స్పందించారు. చాలామటుకు లైఫ్ రిస్క్ పనులేంటని మందలించారు.

మాకేమీ కాదు.. మీకెందుకు?

అదలావుంటే నెటిజన్ల ట్రోలింగ్ తట్టుకోలేకపోయింది ఆ జంట. నెటిజన్ల మండిపాటుకు, సలహాలకు, సూచనలకు తిరిగి ఒకే ఒక్క సమాధానం ఇచ్చారు. అదేంటంటే తాము సేఫ్ స్టంట్ చేశామని.. మా గురించి మాకు తెలుసని పోస్ట్ పెట్టారు. ఇంతకు ఆ జంట ధైర్యం ఏంటంటే.. వాళ్లు చేసింది డేంజరస్ స్టంట్ కాదు. ఎందుకంటే అది త్రీ స్టోరీడ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఒకదానిపై ఒకటి మూడు అంతస్తులుగా నిర్మితమైందన్న మాట. పైన వాళ్లు ఫీట్ చేసేటప్పుడు ఒకవేళ అదుపుతప్పితే.. కింద ఉన్న మరో స్విమ్మింగ్ పూల్ లో పడతారే తప్ప.. వారికి ఏమి కాదు.

కింద ఇంకోటి ఉందిగా..!

కింద ఇంకోటి ఉందిగా..!

మొదట ఆమె గాల్లో తేలుతున్నట్లుగా ఉన్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లకు మండింది. రిస్కేంటి, ఆ ఫీట్లేంటి, ప్రాణాలంటే లెక్క లేదా అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు పెట్టారు. చివరకు ఆ యువజంట త్రీ స్టోరీడ్ స్విమ్మింగ్ పూల్ కు సంబంధించిన ఫోటో పెట్టడంతో విషయం కాస్తా అందరికి అర్థమైంది. పైనుంచి కిందపడ్డా ఇంకో స్విమ్మింగ్ పూల్ లో పడతామే తప్ప మాకేమి కాదంటూ ట్రావెల్ కపుల్ సమాధానమిచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+