అమెరికన్ వేణు స్వామి
Elon Musk: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సమాయాత్తమౌతోన్నారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడాయన.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.
అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరువాత ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు- ఎలాన్ మస్క్. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై ఇక అందరి దృష్టీ నిలిచింది. ట్రంప్ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయ్యొచ్చనే అభిప్రాయాలూ వ్యక్తమౌతోన్నాయప్పుడే.
దీనికి కారణాలు లేకపోలేదు. ట్రంప్‌ను గెలిపించడంలో సర్వశక్తులనూ ఒడ్డారు మస్క్. ఆయనకు బ్యాక్ బోన్‌గా నిలిచారు. పోలింగ్ గడువుకు కొన్ని నెలల కిందటే ఆయనతో స్వయంగా ఇంటర్వ్యూ నిర్వహించారు. ఎక్స్ ద్వారా దాన్ని లైవ్ స్ట్రీమింగ్ సైతం చేశారు. అప్పటి నుంచీ ట్రంప్ గెలుపు అవకాశాలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతూ వచ్చాయనేది తాజా ఫలితాలు తేల్చి పడేశాయి.
అలాంటి ఎలాన్ మస్క్- కొత్తగా కెనడా సాధారణ ఎన్నికలపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది జరిగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో ఓడిపోతాడంటూ జోస్యం చెప్పారు. ఆయనకు డౌన్ ఫాల్ మొదలైందనీ తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు పరాజయం తప్పకపోవచ్చని అన్నారు.
కెనడాలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జస్టిన్ ట్రుడో ఓడిపోవడానికి సహకరిస్తారా? అంటూ రాబర్ట్ రోన్నింగ్ అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు ఎలాన్ మస్క్ సమాధానం ఇచ్చారు. జస్టిన్ ట్రుడో ఓడిపోతాడని తేల్చి చెప్పారు. ట్రుడోను భరించలేకపోతున్నామని, ఇంకో 11 నెలల పాటు వేచి ఉండలేకపోతున్నామంటూ ఆ ఎక్స్ యూజర్ మళ్లీ మస్క్‌కు రిప్లై పెట్టాడు.
338 సీట్లు ఉన్న కెనడా పార్లమెంట్‌కు వచ్చే ఏడాది అక్టోబర్ 20వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఆ దేశ పార్లమెంట్‌ను హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాగా పిలుస్తారు. ప్రస్తుతం ప్రధాని జస్టిన్ ట్రుడో సారథ్యలో లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధికారంలో ఉంది. ఇది మైనారిటీలో ఉన్న ప్రభుత్వం.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications