ఒకే వేదికపై జిన్, కిమ్, పుతిన్: అమెరికాను ఏం చేయాలకున్నార్రా- ట్రంప్ ఉక్రోశం

చైనా విక్టరీ డే పరేడ్ ఉత్సవాలు ఘనంగా ఆరంభం అయ్యాయి. రాజధాని బీజింగ్.. దీనికి వేదిక. తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా దీన్ని నిర్వహిస్తోందా డ్రాగన్ కంట్రీ. ఆర్మీ బ్యాండ్ తన సంగీత ధ్వనుల మధ్య ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు కదం తొక్కుతున్నాయి. దక్షిణ సముద్ర తీరంలో నౌకాబలగాలు కవాతు చేపట్టాయి. వార్ ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ ట్యాంకులతో వందలాదిమంది సైనికులు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తోన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైనిక ప్రదర్శనను ఏర్పాటు చేసింది చైనా. ఈ వేడుకలకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జొంగ్ ఉన్.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో కలిసి వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై ఆసీనులయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రెండు రోజుల సమ్మిట్ ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే చైనా.. తన విక్టరీ డే పరేడ్ ను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trump accused Xi of conspiring with Russia and North Korea

భారత్ సహా అన్ని దేశాల చూపును తన వైపు తిప్పుకొంది. ప్రత్యేకించి- అమెరికా. ఈ విక్టరీ డే పరేడ్ ను నిశితంగా పరిశీలిస్తోంది అగ్రదేశం. ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటోంది. వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జొంగ్ ఉన్, గ్ఝి జిన్ పింగ్.. ఒకే వేదికపై కనిపించడాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడం.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిన్‌పింగ్‌పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. జిన్‌పింగ్ రష్యా, ఉత్తర కొరియాలతో కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా భారీ కుట్ర చేస్తున్నందున, వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్‌లకు శుభాకాంక్షలు తెలియజేయండి.. అంటూ జిన్ పింగ్ ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు.
యుద్ధ చరిత్రను మార్చే ప్రయత్నంలో, జపాన్ ఆక్రమణ దళాలను తరిమికొట్టడాన్ని అమెరికా మద్దతును చైనా తక్కువ చేసి చూపడం పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+