ట్రంప్ మర్డర్ కు కుట్ర.. అక్రమంగా ఇంట్లోకి దూరిన దుండగుడు..
ఇరాన్ తో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రత విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ కు చెందిన ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో రిసార్ట్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ దుండగుడ్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపింది. అతడు ఆయుధాలతో ట్రంప్ భవనంలోకి ప్రవేశించినట్లు యూఎస్ సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ క్రమంలో అతడ్ని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు పేర్కొన్నాయి. ఈ ఘటన ఫిబ్రవరి 22 ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ట్రంప్.. తన అధికారిక భవనం అయిన శ్వేత సౌధంలో ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ లోకి ఓ ఆగంతకుడు ఆయుధాలతో దూరాడు. అయితే అక్రమంగా ప్రవేశించిన ఆ దుండగుడ్ని అక్కడి భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ విషయాన్ని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ధ్రువీకరించింది. అయితే ఘటన సమయంలో ట్రంప్.. వైట్ హౌజ్ లో ఉన్నారు. సాధారణంగా వారాంతాల్లో ట్రంప్ ఈ రిసార్ట్‌లోనే గడుపుతుంటారు. ఈ క్రమంలో ట్రంప్ ఈ రిసార్ట్ లోనే ఉంటారని భావించే ఆ దుండగుడు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆ దుండగుడికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. తాజా ఘటనతో మార్-ఎ-లాగో రిసార్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇక ఇటీవల ట్రంప్ ప్రపంచదేశాలపై విచ్చలవిడిగా టారిఫ్ లు విధించిన విషయం తెలిసిందే. అప్పటికే ఉన్న 10 శాతం టారిఫ్ లను 15 శాతానికి పెంచారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా ట్రంప్ పక్కనపెట్టారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!











Click it and Unblock the Notifications